Breaking News

బెల్లంకొండవారిపాలెంలో 500 ఏళ్ల నాటి శాసనం…

మాచర్ల , నేటి పత్రిక ప్రజావార్త :
పల్నాడు జిల్లా మాచర్ల మండలం, బెల్లంకొండవారిపాలెంలో 500 ఏళ్ల నాటి శాసనం ఆలనాపాలనా లేక నిర్లక్ష్యంగా పడి ఉందని, పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌, సీఈవో, డాక్ట‌ర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. గ్రామగ్రామాల్లో వారసత్వ సంపదను పరిరక్షించేందుకు చేపట్టిన ‘ప్రిజర్వ్‌ హెరిటేజ్‌ ఫర్‌ పోస్టేరిటీ’ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆయన ఆదివారంనాడు, బెల్లంకొండవారిపాలెంలో, పాఠశాల వెనుక భాగంలో చుట్టూ చెత్తా చెదారంతో నిండి భూమిలో కూరుకుపోయిన ఆ శాసన చారిత్రక ప్రాధాన్యతను గ్రామస్తులకు వివరించారు. క్రీ.శ. 1516, జూన్‌, 10న శ్రీకృష్ణదేవరాయని మహాప్రధాని సాళువ తిమ్మరుసు నుంచి, స్థానికుడైన శంకానాయని బస్వానాయని, నాగార్జునకొండ సీమలోని నాగులవరం దక్షిణ దిక్కులో గల మల్యాల, మాల్యగుండ్ల గ్రామాలను నాయంకరంగా (మిలిటరీ సేవలకుగాను) పొందారని, ఆ గ్రామాల ఆదాయాన్ని, కృష్ణానదిని దాటేవారు, అటునుంచి వచ్చే వారిపై విధించే ఉభయమార్గ సుంకాన్ని కూడా గుండాల రఘునాథాలయానికి సమర్పించిన వివరాలుకూడా ఉన్నాయని చెప్పారు. ఈ శాసనం వల్ల బెల్లంకొండవారిపాలెం విజయనగరం సామ్రాజ్యంలో అంతర్భాగమని, గ్రామానికి చెందిన బస్వానాయుడు విజయనగర రక్షణ వ్యవస్థలో ప్రముఖ పాత్ర పోషించాడని, క్రీ.శ.16వ శతాబ్దానికి చెందిన అనేక తెలుగు పదాలు గల శాసనాన్ని, స్థానిక దేవాలయానికో, పాఠశాలకో తరలించి, కాపాడుకోవాలని గ్రామస్తులకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. శాసన ప్రాసస్త్యం తెలిసిన తరువాత గ్రామస్థుల నుంచి విశేష స్పందన లభించిందని వెల్ల‌డించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *