Breaking News

లాటరీ పద్దతిలో “ఈట్ స్ట్రీట్” నందు స్టాల్స్ కేటాయించాలి

-ఎస్టేట్ అధికారికి ఆదేశాలు : స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌,

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇందిరాగాంధీ స్టేడియం వద్ద ఆధునీకరించిన “ఈట్ స్ట్రీట్” ప్రాంతాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌, సోమవారం సాయంత్రం ఎస్టేట్ అధికారి కె.అంబేద్కర్ తో కలసి పరిశీలించిన సందర్భంలో అక్కడ స్టాల్స్ కేటాయించునంత వరకు రాత్రి గం.09-00 నుండి అర్ధ రాత్రి 12-00 గంటల వరకు మాత్రమే అనుమతిని ఇస్తూ, స్టాల్స్ కేటాయింపులు అన్నియు పూర్తి స్థాయిలో లాటరీ పద్దతిన నిర్వహించాలని ఆదేశించారు. ఈ సందర్భంలో సదరు ప్రాంతములో మెరుగైన పారిశుధ్య నిర్వహణ విధానము అమలు చేయాలని, ప్రతి స్టాల్ వద్ద విధిగా డస్ట్ బీన్స్ ఏర్పాటు చేసుకొని పరిసరాలు అన్నియు పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్థానిక వ్యాపారులకు సూచించారు.

తదుపరి 62 డివిజన్ ప్రాంతములోని సంతోషి మాత టెంపుల్ రోడ్, వినాయక గుడి రోడ్, పిండి మర రోడ్ మరియు హైటెన్షన్ రోడ్ లలో పర్యటించి పారిశుధ్య నిర్వహణ మరియు డ్రెయిన్స్ నందలి మురుగునీటి పారుదల తీరును పరిశీలించి ప్రజారోగ్య అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. మేజర్ డ్రెయిన్ కంటే అంతర్గత డ్రెయిన్ పల్లంగా ఉండుట గమనించి సదరు డ్రెయిన్ ఎత్తు పెంచి డ్రెయిన్ నిర్మాణము చేపట్టుటకు అవసరమగు అంచనాలు తాయారు చేయాలని సంబందిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంలో డ్రెయిన్స్ నందు ఫ్లోటింగ్ గ్యార్బెజీ ఉండుట గమనించి మురుగునీటి పారుదలకు అవరోధం ఏర్పడకుండా చర్యలు చేపట్టాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. అదే విధంగా ఇంటింటి చెత్త సేకరణ జరుగుతున్నప్పటికి రోడ్లపై చెత్తను రోడ్డుపై పడవేయుట మరియు ఆవులను పెంచుతూ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండుట గమనించి ఇరువురుకి జరిమానా విధించాలని ఆదేశించారు. పర్యటనలో ఎస్టేట్ అధికారి కె.అంబేద్కర్, హెల్త్ ఆఫీసర్ డా.రామకొటేశ్వర రావు మరియు ప్రజారోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, ఎన్‌టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో విజయవాడ పటమటలంకలోని అదిత్య డిగ్రీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *