Breaking News

దివ్యాంగ విద్యార్థులపై లైంగిక వేధింపులు, నిధుల అవకతవకలపై పూర్తి విచారణ చేసి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అన్నమ్మ దివ్యాంగుల పాఠశాలలో దివ్యాంగ విద్యార్థులపై లైంగిక వేధింపులు, నిధుల అవకతవకలపై పూర్తి విచారణ చేసి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు తెలిపారు.
ఇబ్రహీంపట్నంలోని అన్నమ్మ దివ్యాంగుల పాఠశాలలోని విద్యార్థులపై లైంగిక వేధింపులు గురి అయిన్నట్లు వస్తున్న అభయోగాలపై విచారణ చేసేందుకు నగరానికి విచ్చేసిన రాష్ట్ర చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యులు డా. జె. రాజేంద్ర ప్రసాద్‌, జి సీతారామ్‌, మహిళ కమీషన్‌ సభ్యురాలు బి. వినీత గురువారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ డిల్లీరావుతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇబ్రహీంపట్నంలోని అన్నమ్మ దివ్యాంగుల పాఠశాలలోని విద్యార్థులపై లైంగిక వేధింపులు నిధుల అవకతవకలపై పలు అరోపణలు వచ్చిన నేపథ్యంలో మహిళా శిశు సంక్షేమ శాఖ, రెవెన్యూ, పోలీస్‌, మున్సిపల్‌ అధికారులు, చైల్డ్‌ లైన్‌ ప్రతినిధులను తనిఖీలు నిర్వహంచాలని ఆదేశించామన్నారు. దివ్యాంగ విద్యార్థినిలతో పాఠశాల యాజమాన్యం అనుసరిస్తున్న వ్యవహర శైలిపై పోలీసులను పూర్తి విచారణ చేపట్టాలని కోరామన్నారు. ప్రాధమిక విచారణలో యాజమాన్యం అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. వికలాంగ సంక్షేమ శాఖ సహాయ సంచాలకులను తక్షణమే స్కూల్‌ యాజమాన్యంపై కేసులు నమోదు చేయాలని ఆదేశించామన్నారు. పాఠశాలలోని 13 మంది దివ్యాంగ బాలికలలో 9 మందిని గుణదలలోని విజయమేరి అంధుల పాఠశాలలకు తరలించడం జరిగిందని, మరో నలుగురు బాలికలకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి వారిని కూడా ఆదే పాఠశాలకు పంపడం జరిగిందన్నారు. 28 మంది బాలురలను ఉయ్యూరులోని శీరిషా పునరావాస కేంద్రానికి తరలించడం జరిగిందని పూర్తి విచారణ నిర్వహించి నివేదికలు అందిన వెంటనే బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ డిల్లీరావు కమిటీ సభ్యులకు వివరించారు.
రాష్ట్ర చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యులు డా. జె రాజింద్ర ప్రసాద్‌, జి సీతారామ్‌, మహిళ కమీషన్‌ సభ్యురాలు బి. వినీత మాట్లాడుతూ అన్నమ్మ దివ్యాంగుల పాఠశాలలో దివ్యాంగ విద్యార్థులపై లైంగిక వేధింపుల అభియోగాలను సుమోటోగా తీసుకుని నిజ నిజాలను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించడం జరిగిందని తెలిపారు. అన్నమ్మ దివ్యాంగుల పాఠశాలలో పలు అక్రమాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. దివ్యాంగ విద్యార్థిని, విద్యార్థులను కలిసి ముఖాముఖీ ద్వారా వారి నుండి వివరాలు సేకరించినట్లు కలెక్టర్‌కు వివరించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు.
జిల్లా కలెక్టర్‌ను కలిసిన వారిలో ఐసిడిఎస్‌ పిడి జి. ఉమాదేవి, వికలాంగ సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు బి. రామకుమార్‌, డిపివో కె. బాస్కర్‌రావు, సిడబ్ల్యుసి చైర్‌పర్సన్‌ సువార్తమ్మ, సభ్యులు రాధాకుమారి, చైల్డ్‌ లైన్‌ కో-ఆర్డినేటర్‌ అరవా రమేష్‌ తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *