-లబ్దిదారులు గృహా నిర్మాణాలను చేపట్టేలా చర్యలు తీసుకోండి…
-జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గన్నవరం మండలం కొండపావులూరు సమీపంలో చేపట్టిన జగనన్న కాలనీ లేఅవుట్ పనులను మరింత వేగవంతం చేసి లబ్ధిదారులు గృహా నిర్మాణాలను చేపట్టేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు సంబంధిత అధికారులను ఆదేశించారు.
గన్నవరం మండలం కొండపావులూరు సమీపంలో చేపట్టిన జగనన్న కాలనీ లేఅవుట్ పనులను సంబంధిత అధికారులతో కలిసి గురువారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రాంతంలో నివసిస్తున్న ఇల్లు లేని నిరుపేదలకు సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జగనన్న గృహా నిర్మాణ పథకం కింద పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. కొండపావులూరు నందు 149 ఎకరాలలో సెంట్రర్ నియోజకవర్గానికి 7 వేల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 5 వేల ప్లాట్‌ల్లో సరిహద్దు రాళ్ళు వేసి మార్కింగ్ చేయడం జరిగిందన్నారు. మరో 2 వేల ప్లాట్‌లలో సరిహద్దు రాళ్ళ ఏర్పాటు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించి వారికి అవసరమైతే రుణ సహాయం అందించేలా చర్యలు తీసుకుని గృహా నిర్మాణాలు చేపట్టేందుకు కృషి చేయాలన్నారు. కాలనీలో నీటి సౌకర్యం కొరకు బోరును ఏర్పాటు చేసి ప్రస్తుతం రెండు ట్యాంకర్ల ద్వారా గృహా నిర్మాణాల పనులకు నీటిని సరఫరా చేయడం జరుగుతుందని అవసరమైతే ట్యాంకర్ల సంఖ్యను పెంచి ఎటువంటి ఇబ్బందులు తలఎత్తకుండా నిర్మాణ పనులు వేగవంతానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
కొండపావులూరు జగనన్న కాలనీ లేఅవుట్ పనుల పరిశీలనలో కలెక్టర్ వెంట హౌసింగ్ పిడి శ్రీదేవి, డిఇ బిఎస్ రవికాంత్, గన్నవరం తహాశీల్దార్ సిహెచ్ నరసింహరావు అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News