విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవం సందర్భంగా గురువారం స్థానిక గాంధీ నగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా కో ఆర్డినేటర్ ఆర్. కుమారి మాట్లాడుతూ ప్రతి గృహ కార్మికులకు వారి డిమాండ్ల గురించి తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ లేబర్ ఆఫిసర్ గోవింద్ మాట్లాడుతూ కార్మిక చట్టాలు ,వారి హక్కుల గురించి గృహ కార్మికులకు అవగాహన కలిగించారు. ఈ సదస్సులో హైదరాబాద్ కు చెందిన ఎం.యన్. పి రాష్ట్ర కో ఆర్డినేటర్ జనస్టస్, చైల్డ్ వెల్ఫేర్ మేనేజర్ జాన్సన్ లు మాట్లాడుతూ ప్రతి తల్లి వారి పిల్లల పట్ల వారు తీసుకోవలసిన జాగ్రత్తలు, అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవ ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిస్టర్స్ లోలిత, శైలజ, ఎస్తెర్ రాణి, దుర్గాదేవి మరియు గిరిధర్ మరియు ఈ కార్యక్రమానికి అధికసంఖ్యలో గృహ కార్మికులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News