Breaking News

పెంచలకోన క్షేత్రం లోని  శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న మంత్రి ఆర్.కె.రోజా

నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నెల్లూరు జిల్లా,  రాపూరు మండలం, పెంచలకోన క్షేత్రం లోని  శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆంధ్ర రాష్ట్ర టూరిజం సాంస్కృతిక యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్ కే రోజా దర్శించుకున్నారు. మంత్రి ఆర్.కె.రోజా కి ఆలయ లాంచనాలతో ఆలయ పూజారులు, ఈఓ, ఆలయ కమిటీ సభ్యులు  స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రాంగణంలోని  ఆది లక్ష్మి అమ్మవారి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం ని కూడా రోజా దర్శించుకున్నారు. ఆలయ పూజారులు  మంత్రి ఆర్.కె.రోజా ని వేదమంత్రాలతో ఆశీర్వదించారు. ఈ కార్యక్రమం లో చేజర్ల జడ్పిటిసి పీర్ల పార్థసారథిగారు పెంచలకోన ట్రస్ట్ బోర్డు మెంబెర్  మోదేపల్లి ఇందిర  చేజర్ల మండల సీనియర్ నాయకులు మోదేపల్లి పెంచల నాయుడు ఆలయ ఈఓ వెంకట సుబ్బయ్య  తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *