Breaking News

సర్వోదయ విద్యాలయ బోధన పై సమన్వయ సమావేశం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సర్వోదయ విద్యా బోధన తరహా పద్ధతిలో నగరంలోని అర్బన్ మున్సిపల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో అమలుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించటం జరుగుతున్నదని పాఠశాల ప్రిన్సిపల్ సెక్రెటరీ బి. రాజశేఖర్ అన్నారు. పడమట లంకలోని కొమ్మా సితారావమ్మ జిల్లా పరిషత్ బాలి కోన్నత పాటశాలలో స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ బి రాజశేఖర్, విద్యా సంచాలకులు సురేష్ కుమార్, సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విట్రాసెల్, నాడు నేడు ఇన్ఫ్రా జాయింట్ డైరెక్టర్ మురళిలు సోమవారం జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ డినకర్ పుడ్కర్, జిల్లావిద్యాశాఖ అధికారులు సి వి రేణుక, తాహెర సుల్తానాలతో సర్వోదయ విద్యాలయ బోధన పై సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. పాఠశాలల్లో అత్యాధునిక విద్యాబోధన, వర్చువల్ క్లాస్ రూమ్, డిజిటల్ క్లాస్ రూమ్, నాడు నేడు రెండవ దశ పనులలో అదనపు తరగతి గదుల నిర్మాణం తదితర అంశాలపై సమీక్షించారు. న్యూఢిల్లీలో సర్వోదయ విద్యా బోధన సత్ఫలితాలు ఇస్తున్నాయని విజయవాడ అర్బన్ మున్సిపల్ జిల్లా పరిషత్ పాఠశాలలోఅమలు చేసే విధంగా సాధ్యాసాధ్యాలను పరిశీలించడం జరిగిందని పాఠశాల ప్రిన్సిపల్ సెక్రెటరీ బి రాజశేఖర్ అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *