Breaking News

ఆంధ్రా హాస్పిటల్స్ వైద్య సేవ‌లు అభినంద‌నీయం… : ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రా హాస్పిటల్స్ లో హీలింగ్ లిటిల్ హార్ట్స్‌, యుకె ఛారిటి సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న 23వ ఉచిత పిల్ల‌ల గుండె స‌ర్జ‌రీల క్యాంపు జూన్ 19 నుంచి 26వ తేదీ వరకు జరుగుతుంది. ఈ సందర్భంగా సోమ‌వారం సూర్యారావుపేట‌లోని ఆంధ్రా హార్ట్ అండ్ బ్రెయిన్ ఆసుప‌త్రిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా హాజ‌రైన సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు మాట్లాడుతూ క్లిష్ట‌మైన పిల్ల‌ల గుండె ఆప‌రేష‌న్ల‌కు గ‌తంలో హైద‌రాబాద్ వంటి మ‌హాన‌గ‌రాల‌కు దూర‌ ప్ర‌యాణం చేయాల్సి వ‌చ్చేద‌ని త‌ద్వారా పేద‌లు అనేక వ్య‌య‌ప్ర‌యాస‌లు ప‌డేవార‌ని అదే స్థాయి అత్యాధునిక వైద్య స‌దుపాయాల‌ను విజ‌య‌వాడ ఆంధ్రా ఆసుప‌త్రిలో అందుబాటులోకి తీసుకురావ‌డం అభినంద‌నీయ‌మైన్నారు. ఆంధ్రా హాస్ప‌ట‌ల్, హీలింగ్ లిటిల్ హార్ట్స్‌, యుకె ఛారిటి సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న 23వ ఉచిత పిల్ల‌ల గుండె స‌ర్జ‌రీల క్యాంపు నిర్వ‌హించ‌డం, 2500 స‌ర్జ‌రీలు విజ‌య‌వంతంగా పూర్తిచేయ‌డం హ‌ర్ష‌ణీయ‌మ‌ని పేర్కొన్నారు. ఈ త‌ర‌హా సౌక‌ర్యం పేద‌ల‌కు అత్యాధునిక వైద్యం ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చిన ఘ‌న‌త దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి చెందుతుంద‌ని పేర్కొంటూ ఆయ‌న సేవ‌ల‌ను గుర్తుచేసుకుంటూ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. క‌రోనా స‌మ‌యంలోనూ ఆంధ్రా ఆసుప‌త్రి వైద్య సేవ‌లు ప్ర‌శంస‌నీయ‌మ‌ని పేర్కొన్నారు. ఆంధ్రా హాస్ప‌ట‌ల్ చీఫ్ ఆఫ్ చిల్డ్ర‌న్ సర్విసెస్ డాక్ట‌ర్ పి.వి.రామారావు మాట్లాడుతూ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అత్య‌ధిక పిల్ల‌ల కార్డియాక్ స‌ర్జ‌రీలు నెల‌కు 50 ఆప‌రేష‌న్లు చొప్పున ఏడాదికి 600 మంది పిల్ల‌ల గుండె ఆప‌రేష‌న్లు విజ‌య‌వంతంగా నిర్వ‌హించిన‌ట్లు చెప్పారు. స‌ర్జ‌రీల అనంత‌రం 72గంట‌ల్లో చికిత్స పూర్తైన చిన్నారుల‌ను డిశ్చార్జి చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. అనంత‌రం ఈ నెల 19 నుంచి 26వ తేదీ వరకు నిర్వ‌హిస్తున్న చిన్నారుల ఉచిత గుండె ఆప‌రేష‌న్ల‌కు సంబంధించి వివ‌రాలు ఆసుప‌త్రి వైద్యులు వెల్ల‌డించారు. 20 మంది చిన్నారులకు ఉచిత గుండె ఆప‌రేష‌న్లు నిర్వ‌హించనున్న వైద్య బృందంలో డాక్టర్ విక్రమ్‌, డాక్ట‌ర్ దిలీప్‌, డాక్ట‌ర్ శ్రీమ‌న్నారాయ‌ణ‌, డాక్ట‌ర్ ర‌మేష్‌, డాక్ట‌ర్ బాల‌కృష్ణ‌, విదేశీ వైద్య బృందంలోని (ఇంగ్లాండ్‌) ప్ర‌ఖ్యాతి గాంచిన డాక్ట‌ర్ ఫ్యాబ్రిజియో డే రీటా, డాక్ట‌ర్ జెస్ గ్రీన్, డాక్ట‌ర్ మహమౌద్, కెల్లీ, లారా తదితరులు, ఆంధ్రా హాస్ప‌ట‌ల్ వైద్య బృందం వున్నారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ విక్రమ్‌, డాక్ట‌ర్ దిలీప్‌, డాక్ట‌ర్ శ్రీమ‌న్నారాయ‌ణ‌, డాక్ట‌ర్ ర‌మేష్‌, డాక్ట‌ర్ బాల‌కృష్ణ‌, విదేశీ వైద్య బృందం తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *