విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైస్ జగన్మోరెడ్డి సాగిస్తున్న సంక్షేమం,అభివృద్ధి పాలనకు గడప గడపలో తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. మంగళవారం నాడు 11వ డివిజన్ లోని 201వ సచివాలయ పరిధిలోని విశాల్ మార్ట్ నుండి మొదలై జ్యోతి విద్యాలయం స్ట్రీట్,నూకల రామచంద్రయ్య స్ట్రీట్ ప్రాంతంలో అవినాష్ ఇంటి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు గురుంచి వివరించారు. ఈ సందర్భంలో అవినాష్ మాట్లడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని అన్నారు. రోజురోజుకు ప్రజలలో ముఖ్యమంత్రి కి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్ష టీడీపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. వాటిని తిప్పికొడుతూ ప్రజలకు వాస్తవాలు వివరించి పార్టీని ప్రజలకి మరింత చేరువ చేయడానికె ఈ గడప గడప వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేపతిన్నట్టు తెలిపారు. అర్హత ఉండి ఏదైనా సాంకేతిక కారణాల వల్ల ఎవరికైనా ఏదైనా పధకం రాకపోతే ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా కల్పించారు. ప్రతి ఇంటిలో ఏ ఏ సంక్షేమ పథకాలు అందజేశారో వారికి సవివరంగా వివరించి పార్టీకి మద్దతు తెలపాలని కోరారు.విద్యా, వైద్యం,సేద్యం ఈ మూడు రంగాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరుగులు పెట్టిస్తున్నారని ఆయన అన్నారు నాడు నేడు కార్యక్రమం ద్వారా ఉన్న పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నారని, అదేవిధముగా వైద్య రంగంలో ప్రతి పేదవాడికి వైద్యం అందాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారని అన్నారు. మా తూర్పు నియోజకవర్గం లోనే ఏ ప్రభుత్వం చేయని 350 కోట్లు అభివృద్ధి పనులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసారు అని అన్నారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కులాలకు, మతాలకు,ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,11వ డివిజన్ ఇంచార్జ్ పర్వతనేని పవన్ బాబీ,సందీప్ రెడ్డి,పడతామట దుర్గా ప్రసాద్,చక్రవర్తి,పురుషోత్తం,విజయ్ కార్పొరేటర్ రహెనా,లక్ష్మి,ఇందిరా తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News