Breaking News

ఘనంగా మాజీమంత్రి దేవినేని నెహ్రూ జయంతి… 


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మాజీమంత్రి దేవినేని నెహ్రూ జయంతి సందర్భంగా ఎగ్జిక్యూటివ్ క్లబ్ వద్ద ఆయన విగ్రహానికి తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ దేవినేని అవినాష్, రాష్ట్ర నాయకులు కడియాల బుచ్చిబాబు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ మాట్లాడుతూ నెహ్రు జయంతి సందర్భంగా అనేక ప్రాంతాలలో ఆయన అభిమానులు నెహ్రూ కి ఘనంగా నివాళులర్పిస్తున్నారన్నారు. ఎంఎల్ఏ, మంత్రిగా నెహ్రు పేదలకు ఎన్నో సేవలు చేసారన్నారు. దేవినేని నెహ్రూ ఒక వ్యక్తిగా కాకుండా ఒక వ్యవస్ధగా ఉన్నారన్నారు. మాటిచ్చారంటే ఆ మాట నిలబెట్టుకునే విధంగా పనిచేసే వ్యక్తి దేవినేని నెహ్రూ అని అన్నారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళతామన్నారు. గడప గడపకు కార్యక్రమంలో మూడు నెలలుగా తిరుగుతున్నామన్నారు. పేద ప్రజలకు ఎన్టీఆర్, వైఎస్ఆర్ తరువాత సంక్షేమ కార్యక్రమాలు చేసింది సీఎం జగన్ మాత్రమే అని అన్నారు. తూర్పు నియోజకవర్గం అభివృద్ధి మీద జగన్ ప్రత్యేక దృష్టి పెట్టి నాకు అప్పజెప్పారన్నారు. గతంలో తూర్పు నియోజకవర్గంలో వైసీపీ ఓడిపోయింది. వైసీపీ ఓడిపోయిన నియోజకవర్గ లలో కూడా కోట్లాది రూపాయల తో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. నియోజకవర్గంలో సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలు నుంచి విశేష స్పందన వస్తోందన్నారు.

వైసీపీ రాష్ట్ర నాయకులు కడియాల బుచ్చిబాబు మాట్లాడుతూ నెహ్రు జిల్లా వ్యాప్తంగా పేద ప్రజలకు అండగా నిలిచారన్నారు. ప్రతీ పేదవాడికి అందుబాటులో ఉంటూ దేవినేని నెహ్రూ పేరు నిలబెడుతున్నారు అవినాష్ అని అన్నారు. రాబోయే రోజుల్లో తూర్పు నియోజకవర్గంలో అవినాష్ ను గెలిపిస్తారని కోరుతున్నామన్నారు. జగన్ పాలన పట్ల ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు. సంక్షేమ పథకాలు ని ప్రజలకు మరింత చేరువ చేస్తామన్నారు. అనంతరం నెహ్రు  జయంతి సందర్భంగా వందలాది మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, ఇంచార్జిలు, వైస్సార్సీపీ  ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు దేవినేని అభిమానులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన

-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *