Breaking News

ప్రజా సంక్షేమమే జగన్మోహన్ రెడ్డి లక్ష్యం… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గత మూడేళ్ళుగా సచివాలయం,వాలంటీర్లు వ్యవస్థల ద్వారా ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు అందడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు అన్నారు. గడపగడపకు ౼ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బుధవారం నాడు 11వ డివిజన్ 45,46వ సచివాలయ పరిధిలోని కాలిషా వలి హాస్పిటల్ రోడ్ నుండి మొదలై బందర్ రోడ్, గణపతి ఆశ్రమం రోడ్, స్వీట్ మ్యాజిక్ రోడ్ ప్రాంతంలో ప్రతి ఇంటి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంలో అయన మాట్లాడుతూ గడిచిన మూడేళ్ళలో వైస్సార్సీపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ హామీలను సీఎం జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారని తెలిపారు. అతి తక్కువ సమయంలో ప్రజల మన్ననలు పొందిన ఏకైక ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని పేర్కొన్నారు. గడప గడపకు తిరుగుతూ ప్రజా సమస్యలు వింటూ మూడేళ్ళ పరిపాలనలో ఒక్కో ఇంటికి ప్రభుత్వం ద్వారా అందిన లబ్ధిని వివరించారు. నవరత్నాలలో భాగంగా కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా జగనన్న ప్రభుత్వం ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలను అమలు చేశామని, గడపగడపకు-మన ప్రభుత్వం కార్యక్రమంలో మహిళలు అందరూ స్వచ్ఛందంగా పాల్గొంటూ జగనన్నకు మద్దతు పలుకుతున్నారని, మరో 30 – 40 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగేలా తామంతా కృషి చేస్తామన్నారు. ఈ 11వ డివిజన్ లో 9 రోజుల్లో ప్రజల్లో విశేష స్పందన వస్తుంది అన్నారు. రాష్ట్రంలో ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు. కరోన కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు ఎక్కడ ఆగలేదని, గత తెలుగు దేశం పార్టీ ప్రభుత్వంలో పచ్చ చొక్కా వాళ్లకు మాత్రమే ప్రభుత్వ పథకాలను అందజేసే వాళ్లని, కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కులాలకు, మతాలకు,ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, డివిజన్ ఇంచార్జ్ పర్వతనేని పవన్,కార్పొరేటర్ రహేన, మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ళ చెల్లారావు, రాయణపు శ్రీనివాస్, వైస్సార్సీపీ నాయకులు సందీప్ రెడ్డి, విజయ్, జె.జె.సింగ్, చందు, కోలా లవ, కోలా ఉమ, ముంగి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *