విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహాత్మాగాంధీ రోడ్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్దన బి.ఓ.టి పద్దతిలో నిర్వహిస్తున్న రెండు టాయిలెట్స్ యొక్క నిర్వహణ తీరును నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, పరిశీలించి నిర్వాహకులకు పలు ఆదేశాలు ఇచ్చారు. టాయిలెట్స్ ఎప్పటికపుడు శుభ్రపరచి సెంటేడ్ ఫెనయిల్ చల్లి పరిశుభ్రంగా ఉండునట్లుగా మరియు మరుగుదొడ్ల వద్ద నిరంతరం నీటి సరఫరా కల్పించి ప్రజలకు అందుబాటులో ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ సందర్బంలో టాయిలెట్స్ పరిసరాలలో మొక్కలు ఏర్పాటు చేసి పచ్చదనంతో పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని ఆదేశించారు.
Prajavartha Online Telugu News