విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలకసంస్థ పరిధిలోని వివిధ వార్డుల యందు సుమారు 83 మంది వార్డ్ వాలెంటిర్ల ఎంపిక కొరకు అర్హులైన నిరుద్యో గయువతీ, యువకుల నుండి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొనవచ్చునని నగర కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్.,ఐ.ఏ.ఎస్ ఈ ప్రకటన ద్వా రా తెలియజేసారు. వార్డ్ వాలెంటీర్ల కొరకు ధరఖాస్తు చేసుకొనే వారు 10వ తరగతి (SSC) ఉతీర్ణులై ఉండవలెనని, 23-06-2022 నాటికి 18 సంవత్సరములు నిండి, 35 సంవత్సరములు లోపు గలవారై నగర పరిధిలో నివసించు అభ్యర్థులు మాత్రమే అర్హులు అని ఆసక్తి గల నిరుద్యోగయువతీ, యువకులు ధరఖాస్తు చేసుకొని ఈ అవకాశాన్ని సద్వి నియోగ పరచుకోవాలని పేర్కొన్నా రు. దీనికి సంబందించి అర్జిదారులు పూర్తి విద్యా అర్హతల మరియు ఇతర దృవీకరణ పత్రములను జతపరచి http://40.81.241.107/APVOLUNTEER20/apVolunteer090420201049.vt వెబ్ సైట్ ద్వారా ది.30-06-2022 తేది లోపుగా ధరఖాస్తు చేసుకొనవలెనని తెలియజేసారు. ఇతర వివరాల కొరకు అదనపు కమీషనర్ (ప్రాజెక్ట్స్ ) లేదా వార్డు సెక్రటేరియట్ స్పె షల్ సెల్ ఫోన్ నెంబర్ 8185933187 కు సంప్రదించాలని పేర్కొన్నారు.
Tags vijayawada
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News