Breaking News

ఈ నెల 26న నేషనల్ లోక్ అదాలత్ నిర్వహణ !!

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టుల్లో ఈ నెల 26న నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు, కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఏ.పద్మ తెలిపారు. శుక్రవారం ఉదయం మచిలీపట్నం లోని జిల్లా కోర్టు ప్రాంగణంలోని జిల్లా న్యాయసేవాధికార సంస్థ సమావేశపు మందిరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ , గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, కృష్ణాజిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ ప్రవీణ్ కుమార్ ఆదేశానుసారం, కృష్ణా జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జూన్ 26 వ తేదీ ( ఆదివారం ) జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని చెప్పారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు, ఏలూరు జిల్లాలోని నూజివీడు, కైకలూరు కోర్టుల పరిధిలో వచ్చే ఆదివారం ఈ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుందన్నారు. గత లోక్ అదాలత్ లో జిల్లావ్యాప్తంగా 7802 కేసులు పరిష్కారం కాగా, ఈ దఫా లోక్ అదాలత్ లో 10,000 పెండింగ్ కేసులను పరిష్కరించాలని నిర్ణయంతీసుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మోటారు వాహన ప్రమాద క్లైములు అన్ని రకాల సివిల్ కేసులు రాజీ చేసుకొనవచ్చునని ఆమె తెలిపారు. కనుక కక్షి దారులు తమ లాయర్ల ను సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణా సారికా తెలియజేసారన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ లోక్ అదాలత్ ను ఉద్దేశించి రెవిన్యూ ఇన్సూరెన్సు బ్యాంకింగ్ మరియు బి ఎస్ ఎన్ ఎల్ తదితర సంస్థలకు సంబంధించిన అధికారులతో 127 సమావేశాలు నిర్వహించడం జరిగిందని ఆమె చెబుతూ, జిల్లా వ్యాప్తంగా న్యాయమూర్తులు 218 ముందస్తు లోక్ అదాలత్ సిట్టింగ్స్ నిర్వహించడం జరిగిందన్నారు. . ఎల్లుండి ( ఆదివారం ) జరగబోయే జాతీయ లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారం కొరకూ జిల్లా వ్యాప్తంగా 43 బెంచీలు ఏర్పాటు చేయడం జరిగిందని కృష్ణాజిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఏ. పద్మ వివరించారు.
మచిలీపట్నం, విజయవాడ, గుడివాడ, నూజివీడు, నందిగామ, అవనిగడ్డ, కైకలూరు, గన్నవరం, తిరువూరు, జగ్గయ్యపేట, బంటుమిల్లి, మైలవరం, ఉయ్యురు, మొవ్వ కోర్టుల ఆవరణలో ఈ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకోవలసింది ఆమె విజ్ఞప్తి చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *