Breaking News

కృష్ణాజిల్లాలో మాతృ మరణాలు జరగకుండా చూడాలి… : జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మాతృత్వ మరణాలు అరికట్టేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగితే తల్లీబిడ్డలు క్షేమంగా ఉంటారనే నమ్మకాన్ని ప్రజల్లోకల్పించాలని ఆరోగ్య శాఖ అధికారులను కృష్ణాజిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్ లోని తన చాంబర్లో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో ప్రసవ మరణాలు, పీసీపీ ఎన్డీటీ (స్కానింగ్ సెంటర్లు) తదితర అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న మాతృత్వ మృతులకు గల కారణాలపై వైద్య అధికారులు, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రసవ మరణాలు జరిగినట్లయితే అవసరమైన పేదలకు తగిన సహాయం చేయాల్సిందిగా సూచించారు. గత నెల 18 వ తేదీన గూడూరు మండలం మల్లవోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని కొకనారాణపాలెం గ్రామానికి చెందిన తటవర్తి నాగ విజయలక్ష్మి, ముస్తాబాద్ కు చెందిన కూచిపూడి యశోద, జూన్ 3 వ తేదీన చనిపోయిన నిమ్మకూరు గ్రామానికి చెందిన దారం రాజకుమారి తదితరులు మాతృత్వ మరణాలకు దారితీసిన పరిస్థితులపై కలెక్టర్ ఆరా తీశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవమయ్యే వరకు గర్భిణుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని వైద్యాధికారులను ఆదేశించారు. తల్లుల మరణాలకు ప్రత్యక్ష కారణాలు గర్భిణిల్లో రక్తహీనత, ఇతర సమస్యల ఆధారంగా హైరిస్క్ ప్రగ్నెన్సీలను గుర్తించి ప్రసవం తేదీ కంటే రెండు రోజుల ముందే వారిని అన్ని సౌకర్యాలు ఉన్న మెటర్నిటీ ఆస్పత్రికి తరలించాలని కలెక్టర్ సూచించారు. కాన్పు సమయంలో అత్యధిక శాతంమంది చనిపోవడానికి పలు కారణాలు దోహదపడతాయన్నారు. అవసరమైన రక్తాన్ని, నిపుణులను సిద్ధంగా ఉంచారన్నారు. గర్భం, ప్రసవ సమయంలో తీవ్ర రక్తస్రావం, సెప్సిస్ లేక ఇన్ఫెక్షన్ శరీరమంతటికీ సోకడం, అరక్షిత గర్భస్రావాలు, అధిక రక్తపోటు, గుర్రపువాతం , ప్రసవ సమయంలో జరిగే దుర్ఘటనల, ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ (గర్భాశయం వెలుపల గర్భం పెరగడం), ఎనస్థీషియా (మత్తునివ్వడం)కి సంబంధించిన సమస్యలు, ఎంబాలిజమ్ తదితర కారణాలు 80 శాతం ఉంటే, రక్తహీనత, పోషకాహార లోపాలు, మలేరియా వైరల్ హెపటైటిస్, పచ్చకామెర్లు ధనుర్వాతం, క్షయ, గుండెజబ్బు మొదలయిన పరోక్ష కారణాలు 20 శాతం ఉంటాయని చెప్పారు. తదుపరి సమావేశంలో మాతృత్వ మరణాలకు సంబంధించిన కారణాలు, వారికి అందించిన చికిత్స కేసు షీట్లు , నిర్లక్ష్యం ఎక్కడ జరిగింది అనే అంశాలు స్పష్టంగా పొందుపర్చి ఆ వివరాలను తన వద్దకు తీసుకురావాలని , అలాగే కొందరు మెడికల్ ఆఫీసర్లు ముఖ్యమైన సిబ్బంది ఎందుకు గైర్హాజరయ్యారో తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ డిఎంహెచ్ ఓ డాక్టర్ గీతా భాయిని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో డాక్టర్ వి. శివరామకృష్ణ, డాక్టర్ దుర్గకుమారి, డాక్టర్ కె. రుపేంద్ర, డాక్టర్ ప్రియదర్శిని , డాక్టర్ ఎం. సబిత, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సువర్ణ పీసీపీఎన్డీటీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *