Breaking News

మెటీరియల్ లేదని ఏ ఒక్క నిర్మాణం ఆగడానికి వీలు లేదు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయడానికి అవసరమైన సిమెంటును ఏ కంపెనీ నుండి ఎంత మొత్తం ఇండెంట్ పంపేమో ఆ మేరకు స్టాక్ ఉచిత వచ్చింది? లేనిది? నిర్ధారణ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవిలత స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి జాయింట్ కలెక్టర్ తో కలిసి ఎంపీడీవోలతో హౌసింగ్ డివిజన్, మండల స్పెషల్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ ఉదయం 10:00 కల్లా పూర్తి నివేదికలతో కలెక్టరేట్ కు హాజరు కావాలన్నారు. ఏ కంపెనీకి ఎంతమేర డిమాండ్ ఇచ్చాము , ఆ మేరకు స్టాకును వచ్చింది లేనిది నిర్ధారణ చేసుకోవాలని తెలిపారు. మెటీరియల్ లేదని ఏ ఒక్క నిర్మాణం ఆగడానికి వీలు లేదన్నారు. ప్రతి ఒక ఇంటి నిర్మాణం బేస్మెంట్ స్థాయికి పూర్తి చేయాలన్నారు. వర్షాకాలం పేరు చెప్పి ఇంటి నిర్మాణాలు లేదని చెప్పడానికి వీలు లేదన్నారు. క్షేత్రస్థాయిలో ఆర్ డి వో లు లే అవుట్ లను పరిశీలించడం లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. లేఔట్ లో లేవిలింగ్ పనుల కోసం వాహనాలు వెళ్తున్నాయని, అవసరమైన మెటీరియల్ కోసం ఎందుకు సాధ్యం కాదని కలెక్టర్ ప్రశ్నించారు. ఇళ్ల నిర్మాణాలు ఈ విషయంలో ఇంటి నిర్మాణాలు చేపట్టాల్సి ఉందన్నారు. స్టేజి కన్వర్షన్ పై సంజాయిషీ కి అవకాశం లేదని, ప్రభుత్వం ఇంటి నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మండల ప్రత్యేక అధికారులు వారి శాఖలు పనులతోపాటు మండలాల్లో జరుగుతున్న ప్రతి శాఖ పని పర్యవేక్షించి పనులు వేగంగా జరిగేందుకు సూచనల ను ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *