Breaking News

అవ‌య‌వ‌దానంతో మ‌రికొంద‌రికి పున‌ర్జ‌న్మ‌…


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మ‌నిషి మ‌ర‌ణం త‌రువాత కూడా జీవించి ఉండేందుకు అవ‌య‌వ‌దానం ఒక మంచి మార్గ‌మ‌ని క్యాపిట‌ల్ హాస్ప‌ట‌ల్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ మ‌న్నె హ‌రీష్ అన్నారు. గుంటూరు జిల్లా తెనాలి ప‌ట్ట‌ణానికి చెందిన పొట్టి చంద్రిక‌(52)అనే మ‌హిళ తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ వైద్య చికిత్స నిమిత్తం శుక్ర‌వారం ఉద‌యం పోరంకిలోని క్యాపిట‌ల్ హాస్ప‌ట‌ల్‌లో అడ్మిట్ అయ్యారు. ఆమె ప్రాణం కాపాడేందుకు క్యాపిట‌ల్ హాస్ప‌ట‌ల్ వైద్య బృందం ఎంత‌గానో శ్ర‌మించిన‌ప్ప‌టికీ ఫ‌లితం ద‌క్క‌లేదు. ఈ క్ర‌మంలో అదేరోజు సాయంత్రం చంద్రిక‌కు బ్రెయిన్‌డెడ్ సంభ‌వించిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. మ‌ర‌ణించిన చంద్రిక జీవిత‌కాలంలో త‌న మ‌ర‌ణానంత‌రం అవ‌య‌వాల‌ను వేరొక‌రికి దానం చేయాల‌నే సంక‌ల్పం క‌లిగి ఉండ‌డంతో ఇదే విష‌యాన్ని మృతురాలి కుటుంబ‌స‌భ్యులు క్యాపిట‌ల్ హాస్ప‌ట‌ల్ వైద్యుల‌కు మృతురాలు చంద్రిక సంక‌ల్పాన్ని తెలియ‌జేశారు. వారి సూచ‌న మేర‌కు జీవ‌న్‌దాన్ స్వ‌చ్ఛంద సేవా సంస్థ ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభాగం ప్ర‌తినిధుల‌ను సంప్ర‌దించి క్యాపిట‌ల్ హాస్ప‌ట‌ల్ వైద్యుల స‌హ‌కారంతో శ‌రీరంలోని వివిధ అవ‌య‌వాల‌ను శ‌నివారం సేక‌రించి వివిధ ఆసుప్ర‌తుల‌కు గ్రీన్ ఛాన‌ల్ ద్వారా త‌ర‌లించారు. ఈ సంద‌ర్భంగా క్యాపిట‌ల్ హాస్ప‌ట‌ల్ ఎండీ డాక్ట‌ర్ మ‌న్నె హ‌రీష్ మాట్లాడుతూ.. ఇటువంటి గొప్ప సంక‌ల్పం క‌లిగిన వ్య‌క్తులు ఉండ‌డం వ‌ల్ల‌నే జీవ‌చ్ఛ‌వాల్లా జీవిస్తున్న కొంద‌రికి పున‌ర్జ‌న్మ ల‌భిస్తుంద‌ని చెప్పారు. స‌మాజంలోని ప్ర‌తి ఒక్క‌రూ అవ‌య‌వ‌దానానికి ముందుకు రావాల‌ని సూచించారు. ఈ సంద‌ర్భంగా జీవ‌న్‌దాన్ స్వ‌చ్ఛంద సేవా సంస్థ ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభాగం ఛైర్మ‌న్ డాక్ట‌ర్ కె.రాఘ‌వేంద్ర‌రావు, జీవ‌న్‌దాన్ సంస్థ ప్ర‌ధాన వైద్యులు డాక్ట‌ర్ కె.రాంబాబు మృతురాలు కుటుంబ‌స‌భ్యులు, బంధువుల‌ను అభినందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *