-కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు నాణ్యమైన విద్యుత్
-అందుకే రైతులకే ఉచితంగా ట్రాన్సఫార్మర్ల పంపిణి
-రాష్ర్టంలోనే తొలిసారిగా ఏపీసిపీడిసిఎల్ పరిధిలో ఈ నెల 28 నుండి ప్రారంభం
-సిపీడీసిఎల్ పరిధిలో 50280 నూతన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు
-వీటికి విద్యుత్ సరఫరా నిమిత్తం రైతులకు విద్యుత్ ట్రాన్సఫార్మ్ల ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం
-విద్యుత్ సరఫరా నెట్వర్క్ బలోపేతం చేయడం, మరింత మంది రైతులను ఉచిత విద్యుత్ పథకంలోకి తీసుకురావటమే లక్ష్యం
-ట్రాన్సఫార్మర్ల ఏర్పాటుతో రైతులకు పగటి పూటే మరింత నాణ్యమైన విద్యుత్ సరఫరా
-నగదు బదిలీ తో రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ , రైతు సాధికారికత
-రైతుల ఖాతాలో నేరుగా నగదు జమచేయనున్న ప్రభుత్వం
-రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా, విద్యుత్ సంస్థల్లో జవాబుదారీతనం పెంచేందుకే మీటర్ల ఏర్పాటు
-ఉచిత వ్యవసాయ విద్యుత్ కోసం సెకి నుంచి 7000 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు ఒప్పందం
-ఏపీసిపీడీసిఎల్ సిఎండీ జె పద్మ జనార్ధన రెడ్డి
విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త :
వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా నెట్వర్క్ను మరింత బలోపేతం చేయడంలో భాగంగా సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్( ఏపీసిపీడీసిఎల్) రైతులకు ఉచితంగా ట్రాన్సఫార్మర్లను ఏర్పాటు చేస్తోంది. ఈ బృహత్తర కార్యక్రమానికి ఏపీసిపీడీసిఎల్ వేదిక కానుంది. రాష్ర్టంలోనే ప్రప్రథమంగా ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని రైతాంగానికి అవసరమైన కొత్త మోటార్లకు సంవృద్ధిగా నాన్యమైన విద్యుత్ అందించడంలో భాగంగా కొత్త ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయబోతున్నారు. ఏపీసీపీడీసీఎల్ పరిధిలో కొత్తగా విడుదలైన 50,280 కనెక్షన్లకు గాను నూతనంగా ట్రాన్సఫార్మర్ల తో పాటు 180 మీటర్ల వరకు విద్యుత్ లైన్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు, ఈ కార్యక్రమం విజయవంతమైతే రైతే రాజు అన్న నినాదం నిజమవుతుందని అటు రైతాంగం, ఇటు అధికార యంత్రాంగం పేర్కొంటున్నాయి. ఈక్రమంలో రాష్ర్ట ప్రభుత్వం తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయంపట్ల వ్యవసాయ రంగ నిపుణులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీసీపీడీఎల్ పరిధిలోని విజయవాడ, గుంటూరు, ఒంగోలు సర్కిల్ పరిధిలోని రైతులకు ఈ నెల 28 నుండి ట్రాన్సఫార్మర్లను ప్రజాప్రతినిధులు అందచేయనున్నారు .
ఉచితంగా ట్రాన్స్ఫార్మర్లు …
ఇటీవల కొత్తగా మంజూరుచేసిన 50280 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకుగానూ విద్యుత్ సరఫరా చేసేందుకు హై వోల్టేజి డిస్ట్రిబ్యూషన్ సిస్టం (హెచ్వీడీఎస్) కింద ఉచితంగా ట్రాన్సఫార్మర్ల పంపిణి చేస్తున్నట్లు ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పద్మా జనార్ధన్ రెడ్డి తెలిపారు. ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి , ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ లకు ట్రాన్సఫార్మర్ల పంపిణి గురించి ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు 180 మీటర్ల వరకు ఉచితంగా విద్యుత్ లైన్లను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ మొత్తం వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. విజయవాడ సర్కిల్ పరిధి లో 7965 కనెక్షన్లు , గుంటూరు సర్కిల్ పరిధిలో 3878, ఒంగ్లోలే సర్కిల్ పరిదిలో 17293 వంతున కొత్త కనెక్షన్లలు కాగా వీటికి సంబందించిన మౌలిక సదుపాయాల పనులు వేగంగా జరుగుతున్నాయని సిఎండీ తెలిపారు. ఇవి మరింత త్వరితగతిన పూర్తయేందుకు రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేసారు. ట్రాన్సఫార్మర్ల వల్ల వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని మరింత మంది రైతులకు విస్తరించే వెసులుబాటు లభిస్తుందని, ప్రస్తుతం విద్యుత్ సరఫరా నెట్వర్క్ ను మరింత బలోపేతం చేయవచ్చునని వివరించారు . దీనివల్ల రైతులకు మరింత నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా జరుగుతుందని తెలిపారు.
వ్యవసాయానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలన్నదే సీఎం జగన్ లక్ష్యం…
వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి , ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్ర రెడ్డి ఆదేశాలు చేసినట్లు తెలిపారు. దీనివల్ల రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందడంతో పాటు పంట దిగుబడులు మెరుగవుతాయని, రైతులతో పాటు రాష్త్రంకూడా ఆర్థికంగా బలోపేతమవుతుందని వారు ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ పథకం పరిధిలోకి మరింతమంది రైతులను తీసుకురావడం ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం, వ్యవసాయ ఉత్పత్తులను పెంచడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.
నగదు బదిలీ అందుకే …
దీనిలో భాగంగా రాబోయే 25 ఏళ్ళ పాటు ఉచిత విద్యుత్ సరఫరా ను మరింత మెరుగ్గా , పకడ్బందీగా నిర్వహించే లక్ష్యంతో ప్రభుత్వం నగదు బదిలీ పథకాన్ని కూడా ప్రవేశ పెట్టినట్లు తెలిపారు . ఈ పథకం అమలు వల్ల నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం డిస్కంలను ప్రశ్నించే హక్కు రైతులకు వస్తుందని , దాని వల్ల జవాబుదారీతనం ఏర్పడుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్కరణలలో భాగంగా రాష్ట్రంలో నగదుబదిలీ పథకాన్ని అమలు చేస్తున్నప్పటికీ రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని ఆయన వివరించారు. ఒకవేళ ప్రభుత్వం రైతుల ఖాతా లో నగదు జమచేయడం ఆలస్యం అయినప్పటికీ, రైతులకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని తెలిపారు.
ప్రత్యేక ఖాతాల ద్వారా …
నగదు బదిలీ పథకంలో భాగంగా రైతుల నెలవారీ వ్యవసాయ విద్యుత్ బిల్లులను ప్రభుత్వం వారి బ్యాంకు అకౌంట్లలో జమచేస్తుందన్నారు. రైతులు ఒక్క పైసా కూడా తమ స్వంత డబ్బు చెల్లించవలసిన అవసరం లేదనా, ఇందుకోసం ప్రభుత్వం రైతులతో ప్రత్యేక బ్యాంకు ఖాతాలు తెరవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ఖాతాను ప్రత్యేకించి విద్యుత్ బిల్లుల చెల్లింపులకు మాత్రమే వినియోగించడం వల్ల రైతులకు ఇతరేతర ఎలాంటి ఇబ్బందులు ఏర్పడవన్నారు. అలాగే మీటర్లు ఏర్పాటు చేయడం వల్ల రైతులు ప్రతి నెల తాము ఎంత విధ్యుత్ వినియోగిస్తున్నారో , దానికి ఎంత బిల్లు చెల్లిస్తున్నారో వారికి స్పష్టంగా తెలుస్తుందన్నారు. ఇది అంతిమంగా విద్యుత్ సంస్థల్లో జవాబుదారీతనం పెంచేందుకు దోహదపడుతుందని చెప్పారు.
దీని వల్ల విద్యుత్ సంస్థలు , విద్యుత్ సరఫరా లో తమకు వస్తున్న నష్టాలను రైతులకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఖాతా నుండి రికవర్ చేసుకోకుండా నివారించడానికి వీలవుతుందని వెల్లడించారు. దీని వల్ల విద్యుత్ కొనుగోళ్లు, సరఫరా నష్టాలు, తదితర అంశాల్లో పారదర్శకత పెరుగుతుందని, అంతిమంగా మీటర్ల ఏర్పాటు రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు దోహదపడుతుందన్నారు.
ఎటువంటి ఆంక్షలూ ఉండబోవు…
నగదు బదిలీ వల్ల రైతులు అదనంగా తీసుకునే ఉచిత విద్యుత్ కనెక్షన్ల పై ఎలాంటి ఆంక్షలు ఉండవని, ప్రస్తుతం ఉన్న అన్ని విద్యుత్ కనెక్షన్లను కొనసాగించడం జరుగుతుందని స్పష్టంచేశారు.అంతేగాక ప్రస్తుతం అనధికారికంగా కొనసాగుతున్న విద్యుత్ కనెక్షన్లను కూడా రెగ్యూలరైజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. వచ్చే 25 ఏళ్ళ పాటు రైతులకు నిరాటంకంగా నాణ్యంగా వ్యవసాయ విద్యుత్ సరఫరా చేయడమే నగదు బదిలీ పథకం, మీటర్ల ఏర్పాటు లక్ష్యమని సీఎండీ తెలిపారు . ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ అఫ్ ఇండియా (సెకి) తో 7000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు కు ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని తెలిపారు. ఈ ఒప్పందం వల్ల రాబోయే 25 ఏళ్ల పాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకం అమలుకు ఎలాంటి ఢోకా ఉందని స్పష్టం చేసారు.
Prajavartha Online Telugu News