Breaking News

పేదరిక నిర్మూలనకు చదువే మార్గదర్శకం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమ్మఒడి పథకంలో భాగంగా సోమవారం శీకాకుళం జిల్లా నుండి అమ్మఒడి మూడవ విడతకు సంబంధించిన నగదును ముఖ్యమంత్రి బటన్‌ నొక్కి లబ్ధిదారు తల్లుల ఖాతాలకు జమ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎన్‌టిఆర్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించిన జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు, నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, విజయవాడ సెంట్రల్‌ శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్‌ ఎన్‌టిఆర్‌-కృష్ణాజిల్లా జడ్పిచైర్‌పర్సన్‌ ఉప్పాల హరిక, టిచర్స్‌ యంఎల్‌సి టి కల్పలత, తదితర జిల్లా అధికారులు జిల్లాకు సంబంధించిన మూడవ విడత అమ్మఒడి పథకం లబ్దిదారులు అయిన తల్లుల ఖాతాలకు చేరే విధంగా 265 కోట్ల 89 లక్షల 90 వేల రూపాయల చెక్కును తల్లులకు అందజేశారు. ఈసందర్భంగా కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ పేదరిక నిర్మూలనకు చదువే మార్గదర్శకం అని రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. వీటిని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్‌ సూచించారు. జిల్లాలో 1 లక్ష 77 వేల 226 మంది తల్లులకు 265,89,90,000/- అమ్మఒడి పథకంలో మూడవ విడతగా అందజేశారన్నారు. ఒకటో తరగతి నుండి ఇంటర్‌ వరకు చదువుతున్న విద్యార్థులు చదువు మధ్యలో మానివేయకుండా ఆర్థిక సహాయం అధించే విధంగా ప్రతి పేద విద్యార్థి తల్లుల ఖాతాలకు ఏడాది రూ. 15 వేలు రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ అమ్మఒడిని సద్వినియోగం చేసుకుని స్కూల్‌ మానిపింప కుండా ప్రతి బిడ్డను చదివించి వారి ఆర్థిక భవిష్యత్‌ను తీర్చిదిద్దాలన్నారు.
విజయవాడ సెంట్రల్‌ శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్‌ మాట్లాడుతూ విద్య ద్వారా ప్రతి కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయనే సదుద్ధేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చి అమ్మఒడి, జగనన్న విద్య దీవెన, నాడు-నేడు అనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *