Breaking News

విజయవాడ నగరపాలక సంస్థ నూతన స్థాయి సంఘ సభ్యులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ నూతన స్థాయి సంఘ సభ్యులుగా వియ్యపు అమర్నాద్ (6 వ డివిజన్), కుక్కల అనిత (24 వ డివిజన్), యరడ్ల అంజనేయ రెడ్డి (40 వ డివిజన్), బలసాని మణెమ్మ (35 వ డివిజన్), ఉమ్మడి రమాదేవి (61 వ డివిజన్), చింతల సాంబశివరావు (14 వ డివిజన్) స్థాయి సంఘ నూతన కమిటి కి ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారని కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌ తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ స్థాయి సంఘ సభ్యుల ఎన్నికల పక్రియ నేటితో ముగిసినట్లు నగరపాలక సంస్థ అదనపు కమీషనర్ (జనరల్) మరియు ఎన్నిక నిర్వహణ అధికారి యం.శ్యామల తెలియజేసినారు. స్థాయి సంఘo ఎన్నికల సంబంధించి ఆరుగురు వార్డు సభ్యులు మాత్రమే వారివారి నామినేషన్ దాఖాలు చేయడం జరిగిందని. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది 29-06-2022 బుధవారంతో ముగిసిన దర్మిలా ఏ ఇతర కార్పొరేటర్లు వారి యొక్క నామినేషన్ ఉపసంహరణ చేసుకొని ఉండలేదని కావున స్థాయీ సంఘము ఎన్నిక పుర్తిఅయినట్లుగా ఆమె తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *