విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉత్తర భారత దేశ కార్పొరేటర్ల విజ్ఞాన యాత్ర పై కార్పోరేటర్ల అనుభవాలు పంచుకొనేందుకు నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్ నందు జరిగిన సమావేశంలో కార్పొరేటర్లు వారి వారి అనుభవాలను వివరిస్తూ, మిగిలిన నగరాలలో పోల్చినచొ మన నగరం ఎంతో అభివృద్ధి పధంలో ఉందని రాబోవు రోజులలో మరింతగా అభివృద్ధి సాదించి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సాధించే దిశగా అందరు సమిష్టిగా కృషి చేస్తామని పేర్కొన్నారు.
సదరు సమావేశంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ముందుగా ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ కార్పోరేటర్ల విజ్ఞాన యాత్ర విజయవంతముగా ముగిసిన వివిధ నగరాలలో జరుగుతున్న అభివృద్ధి క్షేత్ర స్థాయిలో పరిశీలించుటకు అవకాశం కల్పిస్తూ దీనికి అన్ని విధములుగా సహాయ సహకారాలు అందించిన మేయర్ మరియు కమిషనర్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. అదే విధంగా వారి ఇరువురుని మరియు డిప్యూటీ మేయర్ లను శాలువలతో సత్కరించారు.
సదరు సమావేశంలో పలువురు కార్పొరేటర్లు విజ్ఞాన యాత్ర వల మన నగరం యొక్క అభివృద్ధి ఇతర నగరాలకు వివరించుటతో పాటుగా అక్కడ ఆయా నగరాలలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు మరియు పలు ప్రాజెక్ట్స్ అమలు చేయుచున్న విధానము, పనులు విధింపు, వసూలు చేస్తున్న తీరు, నగర అభివృద్ధి, ప్రజలకు అందిస్తున్న మౌలిక సదుపాయాలు మరియు పారిశుధ్య నిర్వహాణ విధానము వంటి పలు అంశాలతో పాటుగా ఆదాయ వనరులపై కూడా సమగ్రంగా తెలుసుకోవటం జరిగిందని వివరిస్తూ, మాకు అన్ని విధముల తోడ్పాటు అందించిన మేయర్ మరియు కమిషనర్ గార్లను అభినందించారు.
ఈ సందర్బంలో మేయర్ మాట్లాడుతూ అందరు ఒక కుటుంబ సభ్యులుగా విజ్ఞాన యాత్రకు వెళ్ళుట ఇతర రాష్ట్రాలలోని నగరాలలోని అభివృద్ధి పరిశీలించారని, మన నగరంలో గతంలో అనేక రంగాలలో అభివృద్ధి సాధించి స్వచ్చ్ సుర్వేక్షణ్ నందు 3వ ర్యాంక్, క్లిమేట్ స్మార్ట్ సిటీ లో 4వ స్థానం వంటి అనేక అవార్డులు సాదించుట జరిగిందని, అందరి సమిష్టి సహకారంతో ఈ యాత్ర యొక్క అనుభావనలతో మన నగరం మరింతగా అభివృద్ధి సాదించే దిశగా కృషి చేయాలనీ అన్నారు.
అదే విధంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులుగా మీరు నగరంలో జరుగుతున్న అభివృద్ధితో పాటుగా వివిధ రాష్ట్రాలు మరియు నగరాలలో వారు చేపట్టిన అభివృద్ధి పనులు, వివిధ సంస్కరణలు, ప్రాజెక్ట్స్ లను అద్యయనం చేయుట ద్వారా మీరు ఒక బ్రాండ్ అంబాసిడర్ గా మీ మీ వార్డ్ మరియు నగర అభివృద్ధికి మీరు కృషి చేయుటకు అవకాశం ఉంటుందని అన్నారు. ఈ సందర్బంలో యాత్ర సఫాలికృతం అగుటలో ఆయా నగరాల అధికారుల సమన్వయంతో మా తోడుగా ఉంటూ సహకరించిన లేజన్ ఆఫీసర్ డా.రవి చంద్ మరియు టూర్ నిర్వాహకులు దొడ్ల హేమంత్ లను ఫ్లోర్ లీడర్, డిప్యూటీ మేయర్ మరియు అందరు కార్పొరేటర్లు అభినందించారు.
Prajavartha Online Telugu News