-అమ్మఒడి లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళలు ఆర్థికంగా రాణించినప్పుడే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 59వ డివిజన్ లెనిన్ సెంటర్లో అమ్మఒడి లబ్ధిదారులతో ఎమ్మెల్సీ ఎండి రుహల్లా, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఎండి షాహినా సుల్తానాతో కలిసి బుధవారం ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. విద్యా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు తెలిపారు. గడిచిన మూడేళ్లలో ఒక్క విద్య కోసమే రూ. 52 వేల కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. సెంట్రల్ నియోజకవర్గంలో మూడో విడత అమ్మఒడి పథకం ద్వారా 25,144 మంది తల్లుల ఖాతాలలో రూ. 37.71 కోట్ల నగదు జమ చేసినట్లు వెల్లడించారు. మూడేళ్లలో మొత్తంగా రూ. 111 కోట్ల 61లక్షల లబ్ధి చేకూర్చడం జరిగిందన్నారు. 235వ సచివాలయ పరిధిలో తొలి ఏడాది 379 మందికి, రెండో ఏడాది 386, మూడో ఏడాది 237 మంది అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి పొందారని తెలిపారు. దీంతో పాటు జూలై 5న పాఠశాల విద్యార్థులందరికీ జగనన్న విద్యాకానుక ద్వారా ఉచితంగా నోట్ బుక్స్, వర్క్ బుక్స్, డిక్షనరీ, 3 జతల దుస్తులు, బూట్లు, బెల్టు, సాక్సులు అందజేయనున్నట్లు తెలిపారు.
ఆసరా, చేయూత, సున్నావడ్డీ, అమ్మఒడి, కాపునేస్తం, ఈబీసీ నేస్తం వంటి పథకాలతో నిజమైన మహిళా సాధికారితకు, ఆర్థిక స్వావలంబనకు రాష్ట్ర ప్రభుత్వం దారులు పరుస్తోందని మల్లాది విష్ణు తెలిపారు. మహిళ సంక్షేమం కోసం ప్రత్యేకంగా 7 పథకాలను ప్రవేశపెట్టి దిగ్విజయంగా అమలు చేస్తున్నామన్నారు. మూడేళ్లలో నియోజకవర్గంలో 74,347 మంది అక్కచెల్లెమ్మలకు రూ. 214.40 కోట్ల సంక్షేమాన్ని అందజేసినట్లు మల్లాది విష్ణు వివరించారు. సంక్షేమ పథకాల్లో 90 శాతం మహిళలకే ఇవ్వడం జరిగిందన్నారు. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా 31,100 మంది అక్కచెల్లెమ్మలకు రూ. 56 కోట్ల 35 లక్షలు., సున్నావడ్డీ పథకం ద్వారా 4,276 మందికి రూ. 17 కోట్ల 26 లక్షలు., వైఎస్సార్ చేయూత ద్వారా 6,232 మందికి రూ. 12 కోట్ల 48 లక్షలు., వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 1,958 మందికి రూ. 3 కోట్ల 22 లక్షలు., ఈబీసీ నేస్తం ద్వారా 1,947 మందికి రూ. 2 కోట్ల 92 లక్షలు నేరుగా ఆడపడుచుల ఖాతాలలో జమ చేసినట్లు వివరించారు. మొత్తంగా మూడేళ్లలో 74,347 మందికి రూ. 214.40 కోట్ల సంక్షేమాన్ని అందజేసినట్లు వివరించారు. అలాగే మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించి సీఎం జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగేలా చేశారని తెలిపారు. ముఖాముఖి నేపథ్యంలో అక్కచెల్లెమ్మలు తమ ఆనందాన్ని పంచుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని మల్లాది విష్ణు అన్నారు. ఆడబిడ్డల కళ్లల్లో కనిపిస్తున్న ఆనందం.. ఈ ప్రభుత్వానికి నిండు దీవెనలని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో ఈఈ(ఇంజనీరింగ్) శ్రీనివాస్, జోనల్ కమిషనర్ రాజు, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, సీఐ లక్ష్మీనారాయణ, ఎస్సై సౌజన్య, నాయకులు హఫీజుల్లా, హనీఫ్, దేవిరెడ్డి రమేష్ రెడ్డి, నందెపు సురేష్, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News