Breaking News

ప్రజా సంక్షేమమే జగన్మోహన్ రెడ్డి లక్ష్యం : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ మూడేళ్ల కాలంలో అందించిన సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు మన ప్రభుత్వం వచ్చాక కలిగే మేలును వారికి వివరించి ప్రభుత్వ పనితీరు గురించి వారిని అడగగా తమకు జగన్  ప్రభుత్వం వచ్చాక చాలా మేలు జరుగుతుంది అని తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు.వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి గురుంచి ప్రజలకు వివరించడానికి మన తూర్పు నియోజకవర్గ పరిధిలో చేపట్టిన ‘గడప గడపకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నాడు స్థానిక కార్పొరేటర్ ఉమ్మడిశెట్టి రాధిక,బహదూర్ ఆధ్వర్యంలో 16వ డివిజన్,73వ సచివాలయ పరిధిలోని భవాని రోడ్,సాయి స్ట్రీట్,శాలివాహన స్ట్రీట్ మరియు గాయత్రీ రోడ్ క్రాస్ రోడ్స్ ప్రాంతాలలో తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్‌ ఇంటిఇంటికి వెళ్లి పేద ప్రజల అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. ఈ సందర్భంలో అవినాష్ మాట్లాడుతూ ప్రతి గడపకు వెళ్లి లబ్ధిదారుల తలుపు తట్టి మరీ వారినీ ఆప్యాయంగా పలకరించి మన గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ మూడేళ్ల కాలంలో అందిస్తున్న సంక్షేమ ఫలాలను నేరుగా వారికి వివరించి,వారు పొందుతున్న లబ్ధిని గుర్తుచేస్తూ గతంలో ఎన్నడూ లేనివిధంగా తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చాక తమ ఇంట్లో అందరి మనిషి గా అందరినీ సాకుతున్నారని, మీకు అండగా నిలుస్తున్నారు అని తెలుపుతూ మీ అందరి ఆశీర్వాదాలు మన సీఎం జగన్ గారిపై మన వైసీపీ ప్రభుత్వం పై ఎల్లవేళలా ఉండాలని, మంచి మనసుతో దీవించాలి అని అవినాష్ అభ్యర్థించారు.ఆనాడు ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు గడిచిన మూడేళ్ల కాలంలో కరోనా వంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ సంక్షేమ పథకాలు అందజేసిన చరిత్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కే దక్కిందన్నారు.గత ప్రభుత్వం లో గద్దె దత్తత తీసుకున్న అని ప్రకటన తప్ప అభివృద్ధి కి తీసుకొన్న చర్యలు ఏంటని ప్రశ్నించారు.ఇంకోసారి మీ రాజకీయ మనుగడ కోసం ప్రచార ఆర్భాటాల కోసం ప్రభుత్వాన్ని విమర్శిస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చెల్లారావు,17వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి,వైసీపీ నాయకులుగుమ్మడి విజయ్ కుమార్,వేముల దుర్గారావు,కావటి దామోదర్,బచ్చు మురళి,సొంగా రాజ్ కమల్,గల్లా రవి మరియు వైస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, ఎన్‌టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో విజయవాడ పటమటలంకలోని అదిత్య డిగ్రీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *