Breaking News

మౌలిక సదుపాయాల పర్యవేక్షణ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, గురువారం రాత్రి యం.జి రోడ్ పోలీస్ కంట్రోల్ రూమ్ నుండి కమిషనర్ క్యాంపు కార్యాలయం వరకు అధికారులతో కలసి క్షేత్ర స్థాయిలో పాదచారులు, వాహనాల చోదకులకు అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను పర్యవేక్షించారు. ఈ సందర్బంలో యం.జి రోడ్ పోలీస్ కంట్రోల్ రూమ్ నుండి కమిషనర్ క్యాంపు కార్యాలయం వరకు గల ఆరు జంక్షన్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేస్తూ, భూగర్భ నాళాలు ఏర్పాటు చేయడం ద్వారా ఓవర్‌ హాంగింగ్ వైర్లను తొలగించడంతో పాటు విద్యుత్ స్తంభాలు మినహా మిగిలిన అన్ని స్తంభాలను తొలగించాలని అధికారులకు సూచించారు. అదే విధంగా జంక్షన్లు మరియు ఫుట్‌పాత్‌లను ఆకర్షణీయంగా తీర్చిదిద్ది అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. వీటితో పాటుగా ఫుట్‌పాత్‌ల పక్కన వినియోగ మార్గం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రహదారి వెంబడి పొడవునా ఉద్యానవనాలు మరియు గ్రీనరీ ఏర్పాటు చేయుట ద్వారా పరిసరాలు ఆహ్లాదకరంగాను మరియు పర్యావరణ తగించుటకు అవకాశం ఉండునని ఆ విధంగా అనుకూల డిజైన్లను రూపొందించాలని సంబందిత అధికారులకు సూచించారు. ఈ సందర్బంలో యం.జి రోడ్ రోడ్ మర్జిన్స్ వెంబడి ఆక్రమణ ప్రదేశాలలో ఉన్న వ్యాపారులతో సంప్రదించి హాకర్స్ తొలగింపుకు గల అవకాశాలను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. పర్యటనలో డిప్యూటీ సిటి ప్లానర్ (ప్లానింగ్ ) జుబిన్ శిరన్ రాయ్, ఎగ్జీక్యూటివ్ ఇంజనీర్ ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *