విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతీయ రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వంచే 1961న భారతరత్నచే గౌరవించబడిన డా॥ బిధాన్ చంద్రరాయ్ (బిసి రాయ్) వర్థంతి, జయంతి ఒకే రోజున (జూలై 1) కావడంతో జూలై 1వ తేదీన డాక్టర్స్ డే కావడంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డా॥ బిధాన్ చంద్రరాయ్‌కు మన భారతీయ గ్రామీణ వైద్యుల సంక్షేమ తరఫున ఘన నివాళులర్పిస్తూ జాతీయ వైద్యుల దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ప్రతి యేటా జరిగే జాతీయ వైద్యుల దినోత్సవంను ఈ ఏడాది కూడా అత్యంత ఘనంగా ఐఆర్ఎంపిడబ్ల్యుఎ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కె.గణపతిరావు, అధ్యక్షులు కె.రవిచంద్ర, ఉపాధ్యక్షులు కె.సురేష్‌బాబు, ప్రధాన కార్యదర్శి కె.హేమసుందర్, కోశాధికారి బి.ఆర్.ఆంజనేయులు, జాయింట్ సెక్రటరీ ఎంఎఎల్ మాధురి, ఈసీ సభ్యులు కె.వరలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News