భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక పుణ్యభూమి అని, ఇలాంటి పుణ్యభూమికి రావడం సంతోషంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు సోమవారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ప్రధాని నరేంద్రమోదీకి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు. భీమవరంలోని అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని 30 అడుగుల సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం బహిరంగసభలో తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ఆయన అజాదీకా అమృత్ మహోత్సవాలు జరుగుతున్న వేళ అల్లూరి 125వ జయంతి వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. మన్యం వీరుడు, తెలుగు జాతి యుగ పురుషుడు అల్లూరి అని ప్రధాని కొనియాడారు. యావత్ దేశానికి అల్లూరి సీతారామరాజు స్ఫూర్తి అన్నారు. దేశాభివృద్ధికి యువత ముందుకు రావాలి వీరభూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. రంపచోడవరం ఆందోళన ప్రారంభించి నేటికి వందేళ్లు పూర్తయ్యింది. ఎందరో మహానుభావులు దేశం కోసం త్యాగం చేశారన్నారు. అల్లూరి సీతారామరాజు ఆదివాసుల శౌర్యానికి ప్రతీక. అల్లూరి జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం. అల్లూరి తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారు. మనదే రాజ్యం నినాదంతో ప్రజలను ఏకతాటిపైకి తెచ్చారు. అల్లూరి చిన్న వయస్సులోనే ఆంగ్లేయులపై తిరగబడ్డారన్నారు. ఉయ్యాల వాడ నరసింహారెడ్డి గొప్ప ఉద్యమకారుడన్నారు. దేశాభివృద్ధికి యువత ముందుకు రావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
స్వతంత్ర పోరాటంలో ఆదివాసీల త్యాగాలను స్మరిస్తూ ఆదివాసీ సంగ్రహాలయాలు, లంబసింగిలో అల్లూరి మెమోరియల్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని ప్రధాని అన్నారు. దేశం కోసం బలిదానం చేసిన వారి కలను సాకారం చేయాలన్నారు. అల్లూరికి సంబంధించిన అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ప్రధాని అన్నారు. మొగల్లులోని ధ్యాన మందిరం, చింతపల్లి పీఎస్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. వన సంపదపై ఆదివాసులకే హక్కు కల్పిస్తున్నామన్నారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధిలో భాగంగా మన్యం జిల్లాలను అభివృద్ధి చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. యావత్ భారతావనికే మన్యం వీరుడు, తెలుగు జాతి యుగపురుషుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అల్లూరి జయంత్యుత్సవాల సందర్భంగా ఆయన పుట్టిన నేలపై మనమంతా కలుసుకోవడం అదృష్టమని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా పెద అమిరంలో 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహావిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రధాని పాల్గొన్నారు. భీమవరంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని పెద అమిరం వేదిక పైనుంచే వర్చువల్‌గా ఆయన ఆవిష్కరించారు. అనంతరం అల్లూరి కుటుంబసభ్యులను మోదీ సత్కరించారు. అల్లూరి శ్రీరామరాజుతో పాటు స్వాతంత్ర్యోద్యమ సమయంలో అల్లూరి సీతారామరాజుకి వెన్నంటే ఉన్న మల్లు దొర మనవడు బోడి దొరను ప్రధాని సన్మానించారు. అనంతరం మోదీ మాట్లాడారు. తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించిన నరేంద్ర మోడీ ‘తెలుగు వీర లేవరా.. దీక్షబూని సాగరా..’ అనే విప్లవ గీతాన్ని ప్రస్తావించారు.
‘స్వాతంత్ర్య సాధనలో సమరయోధుల పోరాట పటిమ గురించి అందరికీ తెలియాలి. ఆ స్ఫూర్తి కోసమే ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలు జరుపుకొంటున్నాం. దేశ చరిత్రలో అనాదిగా ఒకే దేశం..ఒకే భావన భాగమైంది. అల్లూరి జీవన ప్రస్థానం మనందరికీ స్ఫూర్తిదాయకం. మనదే రాజ్యం నినాదంతో ప్రజలకు ఒక్కతాటిపైకి తీసుకొచ్చారు. మన్యం వీరుడిగా ముందుకొచ్చి ఆంగ్లేయులతో వీరోచితంగా పోరాడారు. ఆంధ్ర రాష్ట్రం పుణ్యభూమి..వీరభూమి. ఎందరో దేశభక్తులకు పురుడుపోసిన గడ్డ ఇది. పింగళి వెంకయ్య, కన్నెగంటి హనుమంతు, పొట్టి శ్రీరాములు, వీరేశలింగం పంతులు వంటి మహానుభావులు జన్మించిన గడ్డ ఆంధ్రప్రదేశ్. దేశం కోసం బలిదానం చేసిన స్వాతంత్ర్య సమరయోధుల కలలను సాకారం చేయాలి. పుణ్యభూమికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. వీరభూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. రంప ఆందోళన ప్రారంభించి నేటికి వందేళ్లు పూర్తయింది. మన్యం వీరుడి 125వ జయంత్యుత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉంది. యావత్ భారతదేశం తరఫున అల్లూరి పాదాలకు వందనం చేస్తున్నా. ఆదివాసీల శౌర్యం, ధైర్యానికి ప్రతీక ఆయన. అల్లూరి సీతారామరాజు కుటుంబసభ్యులతో వేదిక పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. అల్లూరి నడయాడిన అన్ని ప్రాంతాలను స్మరించుకుంటూ ఉన్నాం. ఎందరో మహానుభావులు దేశం కోసం త్యాగం చేశారు. వారి త్యాగాలను నిరంతరం స్మరించుకుని ముందుకెళ్లాలి. దేశంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. సమస్యలపై పోరాడేతత్వం అల్లూరి నుంచి నేర్చుకోవాలి. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఆయన స్ఫూర్తితో ముందుకెళ్తే మనల్ని ఎవరూ ఆపలేరు అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News