Breaking News

జంక్షన్ల అభివృద్ధి చర్యలు చేపట్టాలి…

-బెంజి సర్కిల్ నుండి రామవరప్పాడు రింగ్ వరకు గల జాతీయ రహదారి పరిశీలన
-అధికారులకు పలు ఆదేశాలు – కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ మంగళవారం అధికారులతో కలసి క్షేత్ర స్థాయిలో 8వ డివిజన్ నందలి బ్యాంక్ కాలనీ, పిన్నమనేని పాల్లిక్లినిక్ రోడ్ మరియు బెంజి సర్కిల్ నుండి రామవరప్పాడు రింగ్ వరకు గల జాతీయ రహదారి తదితర ప్రాంతాలలో పర్యటించి పారిశుధ్యo, గ్రీనరీ అభివృద్ధిపై అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు ఆదేశాలు ఇచ్చారు.

8వ డివిజన్ పరిధిలో బ్యాంక్ కాలనీ వాటర్ ట్యాంక్ వద్ద కల కంపాక్టర్ బిన్ ను తొలగించి అక్కడ స్థానికులు ఎవరు చెత్త మరియు వ్యర్ధములు పడవేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య అధికారులకు సూచించారు. పిన్నమనేని పాల్లిక్లినిక్ రోడ్ నందలి సెంట్రల్ డివైడర్ నందు పొడవైన మొక్కలు ఏర్పాటు చేసి రోడ్ మార్జిన్లలో మరియు పల్లపు ప్రదేశాలలో వర్షపు నీటి నిల్వలు లేకుండా చూడాలని సంబందిత అధికారులకు ఆదేశించారు. అదే విధంగా బెంజి సర్కిల్ జంక్షన్ అభివృద్ధికి డిజైన్ తయారు చేయాలని, సెంట్రల్ డివైడర్ నందు గల కుండీలను తొలగించి పూర్తి స్థాయిలో గ్రీనరి పెంపొందించుటకు చర్యలు తీసుకోవాలని మరియు ఫ్లై ఓవర్ బ్రిడ్జి దిగువన 13-14 పిల్లర్స్ మద్యన ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా బస్ స్టాప్ ఏర్పాటు చేయు అంశముపై హై వే అధికారులతో చర్చించి తగు చర్యలు తీసుకోవాలని అన్నారు.

రామవరప్పాడు జంక్షన్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం ముందు గల పోలీస్ బాక్స్ అక్కడ నుండి వేరే ప్రదేశానికి మార్పు చేయుటతో పాటుగా అక్కడ గ్రీనరీ అభివృద్ధి పరచుటతో పాటుగా జంక్షన్ నందు పూర్తి స్థాయిలో పచ్చదనం పెంపొందించే విధంగా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఉద్యానవన అధికారులకు సూచించారు. దీనితో పాటుగా ఇన్నోటేల్ హోటల్ వెనుక వైపు మన విజయవాడ సైన్ బోర్డు చుట్టు ప్లాంటేషన్ అభివృద్ధి పరచి పరిసరాలలో ఉన్న అనధికార ఆక్రమణలను తొలగించాలని మరియు అదే ప్రాంతములో గల ట్రాయంగిల్ ఏరియా అంతయు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని మరియు నూజివీడు కు వెళ్లు రోడ్డు నందు బస్ స్టాప్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సూచించారు. నగరపాలక సంస్థ సరిహద్దు ప్రాంతములో గల ఆంజనేయ స్వామి గుడి వెనుక భాగములో వాటర్ ఫౌంటెన్ ఏర్పాటు చేసి పచ్చదనంతో తీర్చిదిద్దాలని సంబందిత అధికారులకు తెలిపారు. అదే విధంగా భారత్ పెట్రోల్ బంకు ముందు గ్రీనరీ అభివృద్ధి పరచాలని మరియు బీహార్ బెంగాల్ రోడ్ లైన్స్ ప్రక్కన జాతీయ రహదారి లో ఇంటర్ లాకింగ్ టైల్స్ తొలగించి ఫుట్ పాత్ ఎత్తు తగ్గించి గ్యాప్ మద్యన మొక్కలు నాటాలని అన్నారు. చందుస్ కిచెన్ ముందు గల డ్రెయిన్ నందు సిల్ట్ తొలగింపు పనులు నిర్వహించాలని సూచించారు. మహానాడు జంక్షన్ అభివృద్ధి పరచి స్మార్ట్ రోడ్ గా తీర్చిదిద్దుటకు తగిన చర్యలు చేపట్టాలని సంబందిత అధికారులకు సూచించారు.

పర్యటనలో డిప్యూటీ సిటి ప్లానర్ (ప్లానింగ్) జుబిన్ శిరన్ రాయ్, ఎగ్జీక్యూటివ్ ఇంజనీర్లు వి.చంద్ర శేఖర్, ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, హెల్త్ ఆఫీసర్ డా.శ్రీదేవి, ఏ.డి.హెచ్ శ్రీనివాస్, జోనల్ కమిషనర్ పార్ధసారధి మరియు ఇతర అధికారులు క్షేత్ర స్థాయి సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *