Breaking News

గాంధీజీ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో విద్యార్ధులకు జగనన్న విద్యా కానుకల పంపిణి

-శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చదువుకునే వయసులోని పిల్లల విద్యాబ్యాసానికి పేదరికం అనేది అడ్డంకి కాకూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం జగనన్న అమ్మఒడి పేరుతొ వినూత్న పథకాన్ని అమలు చేస్తుందని పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. వన్ టౌన్ గాంధీజీ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో 2022 – 2023 విద్యా సంవత్సరానికి గాను జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణి కార్యక్రమములో శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, శాసన మండలి సభ్యులు యం.డి.రుహుల్లా, కొ-ఆప్టేడ్ మెంబర్ సయ్యద్ అలీమ్ పాల్గొని విద్యార్ధులకు జగనన్న విద్యా కానుకలను అందజేసారు. ఈ సందర్బంలో శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ అమ్మఒడి ద్వారా దారిద్ర్యరేఖకు దిగువనున్న ప్రతి కుటుంబానికి చెందిన విద్యార్ధులకు ప్రతి ఏటా రూ. 15,000/- ఆర్ధిక సహాయం అందిస్తుందని, రాష్ట్రంలో ఒకటొవ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రవేట్ పాఠశాలలు, కళాశాలలో చదువుతున్న వారికీ ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఆర్ధిక సహకారం అందించి వారి ఉన్నత చదువులను అభ్యసించే విధంగా ప్రోత్సహిస్తుందని అన్నారు. అదే విధంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ గత మూడు విద్యా సంవత్సరాలలో అమ్మ ఒడి ద్వారా లబ్ది పొందిన వారికీ రూ.1,24,94,000/- 2019-2022 లో – రూ. 44,52,000/-, 2020-2021 లో – రూ. 48,44,000/-, 2021-2022 లో – రూ.31,98,000/- అందించుట జరిగిందని అన్నారు. అదే విధంగా మన బడి – నాడు – నేడు కార్యక్రమాల ద్వారా రూ. 68,37,842/- లు మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్బంలో 2022 విద్యా సంవత్సరoలో పదోవ తరగతి పబ్లిక్ పరిక్షలలో అత్యదిక మార్క్ లను సాదించిన విద్యార్ధులకు అభినందనలు తెలియజేసారు. తదుపరి పాఠశాల ప్రాంగణంలో విద్యార్ధులతో కలసి మొక్కలు నాటి వాటిని రక్షించవలసిన భాద్యత మీదే అని హితువు పలికారు. కార్యక్రమములో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.నీరజ, పాఠశాల ఉపాధ్యాయిని ఉపాద్యాయులు, విద్యార్ధిని విద్యార్ధులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *