-బాల్య వివాహాలు బాలల హక్కులు లైగింకవేధింపులపై అవగాహన కల్పించాలి..
-బాల్య వివాహాలు ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకోండి..
-జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలో సైకాలజిస్‌ట్లను ఏర్పాటు తప్పనిసరి చేసి విద్యార్థిని విద్యార్థులకు బాల్య వివాహాలు వలన కలిగే అనార్థలు బాలల హక్కులు లైగింక వేధింపులపై ప్రతి వారం ప్రత్యేక తరగతుల ద్వారా బోదించేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అన్నారు.
బాల్య వివాహాలు లైగింక వేధింపుల నివారణ బాలల హక్కుల సంరక్షణ పై జిల్లా కలెక్టర్ డిల్లీరావు మంగళవారం ఆయన కార్యాలయం నుండి ఐసిడిఎస్, పోలీస్, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్, ఎన్‌సిఎల్‌పి. లేెబర్, సిడబ్ల్యుసి అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బాల్య వివాహాలు లైగింక వేధింపుల నివారణ మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. బాలల హక్కుల చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి వాటిని ఉపయోగించుకునేందుకు కృషి చేయాలన్నారు. బాల్య వివాహాలు లైగింక వేధింపుల నివారణ బాలల హక్కుల సంరక్షణ పై విద్యార్థినిలో అవగాహన కల్పించేందుకు పాఠశాలలు కళాశాలలో ప్రత్యేక తరగతులను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రైవేట్ పాఠశాలు కళాశాలలో సైకాలజిస్ట్ ఏర్పాటు తప్పనిసరి చేసేలా వెంటనే ఉత్తర్వులు జారీ చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛందగా ముందుకు వచ్చే సైకాలజిస్ట్ సేవలను ఉపయోగించుకుని విద్యార్థులకు బాల్య వివాహాలు లైగింక వేధింపుల నివారణ బాలల హక్కుల సంరక్షణ పై అవగాహన కల్పించేందుకు బోదన తరగతులను నిర్వహించేలా విద్యా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. బాల్య వివాహాల వలన పిల్లలో ఎదురైయ్యే ఆరోగ్య సమస్యలను వివరించవలసిన అవసరం ఉందన్నారు. బాల్య వివాహాం చేసుకున్న ఆడపిల్లలో మానసిక ఎదుగుదల ఉండదని, గర్భిణీ సమయంలో తల్లిబిడ్డలకు ప్రాణాపాయ పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయని, పుట్టే బిడ్డలకు అంగవైక్యాలం ఏర్పడువచ్చుననే సందేశాలను వివరించేలా ప్రచారం నిర్వహించడం ద్వారా అవగాహన కల్పించాలన్నారు. బాల్య వివాహాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లాలలో ఒక బాల్య వివాహా కేసుకూడా నమోదు కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు, వివాహా శుభముహుర్తలు ఎక్కువగా ఉండే రోజులలో వివాహాలపై ప్రత్యేక నిఘా పెట్టి బాల్య వివాహాలు గుర్తించి, తక్షణమే నివారించాలన్నారు. బాల్య వివాహాలను ప్రోత్సహించే వారిపై కేసులను నమోదు చేయాలన్నారు. బాల్య వివాహలకు అనుమతినిచిన వారితో పాటు వివాహా నిర్వహించిన, సహకారించిన, వివాహాలకు హాజరైన వారు కూడా నిధుతులుగానే పరిగణించబడుతారన్నారు. బాల్య వివాహల చట్టం ప్రకారం నింధుతులకు రెండు సంవత్సరాల జెలు శిక్ష , లేదా లక్ష రూపాయల జరిమానతో పాటు నాన్‌బెయిల్‌బుల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుందనే సమాచారాన్ని ప్రజలోకి తీసుకు వెళ్ళాలన్నారు. బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నివారించేందుకు చర్యలు తీసుకోవాలని వాలంటీర్లు, ఆషా వర్కలు విధి నిర్వహణలో ప్రతి ఇంటిని సందర్శిస్తారని, 14 సంవత్సరాలలోపు పిల్లలతో పనులు చేయిస్తున్నట్లు గుర్తిస్తే తక్షణమే సంబందిత అధికారుల దృష్టికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. బడిబయట ఉన్న పిల్లలను బడిలో చేర్చే బాధ్యతను బాల కార్మిక నిర్మూల సంస్థ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఇటుక బట్టిలు, కంకర క్వారీలలో మన రాష్ట్రానికి చెందిన వారే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కూలీలు పనిచేస్తున్నారన్నారు. వారి పిల్లలకు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలను అందించేలా వైద్య అధికారులు పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.
అనంతరం బాల్య వివాహాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మహిళాభవృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ రూపొందించిన పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ డిల్లీరావు అవిష్కరించారు.
కాన్ఫరెన్స్‌లో ఐసిడిఎస్ పిడి జి ఉమాదేవి, ఎసిపి వెంకటరత్నం, ఎన్‌సిఎల్‌పి పిడి ఆంజనేయరెడ్డి, కార్మిక శాఖ డిప్యూటి కమీషనర్ ఆషారాణి, డియంహెచ్‌వో డా.యం సుహసిని, ఫోరం ఫర్ చైల్డ్‌రైట్స్ కో`ఆర్డినేటర్ అరవ రమేష్, సిడబ్ల్యుసి చైర్‌పర్సన్ సువార్త, సిడబ్ల్యుసి చైర్‌పర్సన్ సభ్యులు డా. కృష్ణకుమారి, సిడిపివోలు టి నాగమణి, జి మంగమ్మ, డి భాగ్యరేణుక, జె లక్ష్మిభార్గవి, జి గ్లోరి, కె. పుష్పలత, కె. బేబి సుకన్య తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News