-జాయింట్ కలెక్టర్ నూపూర్ అజయ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఐదు కేజిల ఎల్పిజి గ్యాస్ సీలిండర్లను రేషన్ దుకాణాల ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్ కలెక్టర్ నూపూర్ అజయ్ అన్నారు. రేషన్ దుకాణాలలో ఐదు కేజిల ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల ఏర్పాటుపై గ్యాస్ కంపెనీల ప్రతినిధులు పౌరసరఫరాలు, రెవెన్యూ అధికారులు, రేషన్ దుకాణాల డీలర్లతో సమావేశమై 5 కెేజిల గ్యాస్ సిలిండర్ల సరఫరాపై చర్చించి గ్యాస్ కంపెనీలు, రేషన్ డీలర్ల మధ్య అవగాహన అంగికారం చేసేలా చర్యలు తీసుకున్నామని జాయింట్ కలెక్టర్ నూపూర్ అజయ్ తెలిపారు. బంగారం, వెండి వస్తువుల తయారీదారులు, చిరువ్యాపారస్తులు పేద కుటుంబాల వారు 5 కేజిల సిలిండర్ల వినియోగం పై ఆదారపడుతున్నారన్నారు. బహిరంగ మార్కెట్లలో 5 కేజిల ఎల్పిజి గ్యాస్ సిలిండర్లకు డిమాండ్ ఉండడంతో నిర్థేశించిన ధరలకంటే అధికంగా వినియోగదారుల నుండి వసూలు చేస్తున్నారన్నారు. దీనిని నివారించి వినియోగదారులకు నిర్థేశించిన రేట్లకే అవసరమైన గ్యాస్ సిలిండర్లను రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేయాలని నిర్ణయించామన్నారు. రేషన్ దుకాణాల ద్వారా సిలిండర్లను సరఫరా చేయడం వలన వినియోగదారులకు సమీపంలోనే అందుబాటులో ఉంటాయన్నారు. వినియోగదారులకు గ్యాస్ కంపెనీల నుండి నేరుగా రేషన్ దుకాణాలకు 5 కేజిల ఎల్పిజి గ్యాస్ సిలిండర్లను సరఫరా చేసేలా రేషన్ డీలర్లతో అవగాహన ఒప్పందం చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రేషన్ దుకాణాల డీలర్లు గ్యాస్ కంపెనీలు నిర్థేశించిన రేట్లకే రేషన్ దుకాణాదారులకు పంపిణీ చేసి వినియోగదారులకు 5 కెేజిల గ్యాస్ సిలిండర్లు అంబాటులో ఉంచేలా చర్యలు తీసుకుకోవాలని జాయింట్ కలెక్టర్ నూపూర్ అజయ్ అన్నారు. సమావేశంలో డిఎస్వో పి. కోమలిపద్మ, హెచ్పిసిఎల్ రిజనల్ మేనేజర్ జిఎల్యం నాయుడు, రేషన్ డీల్లర్ల సంఘం అధ్యక్షులు యం.వెంకటరావు, ఐఓసిఎల్ బిపిసిఎల్ కంపెనీల ప్రతినిధులు రేషన్ డీలర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News