Breaking News

ఆర్జీదారుడు సంతృప్తి చేందేలా స్పందన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆర్జీదారుడు సంతృప్తి చేందేలా స్పందన ఆర్జీలను గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు.
నగరంలోని కలెక్టరేట్‌ స్పందన సమావేశం మందిరంలో శుక్రవారం అన్ని శాఖల అధికారులతో స్పందన ఆర్జీల పరిష్కారం పై జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు వర్క్‌ షాప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆర్జీలను కూలకుషంగా, నిశితంగా ఒకటికి రెండు సార్లు పరిశీలించాలని అధికారులను కోరారు. ఆర్జీదారుడు ఆర్జీ ఇస్తూ సమస్యను వివరిస్తున్నప్పుడు శ్రద్దగా వినాలని అప్పుడే సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు. ధరఖాస్తులను పూర్తి స్థాయిలో చదివి అర్థం చేసుకుని పరిష్కార మార్గం చూపాలన్నారు. గడువులోగా ఆర్జీలను పరిష్కరించాలని, ఎట్టిపరిస్థితిలోను గడువు దాటిన ఆర్జీలు ఉండరాదని కలెక్టర్‌ స్పష్టం చేశారు. జిల్లాలో ఇప్పటివరకు పోర్టల్‌, డాష్‌బోర్డు, ప్రత్యక్షంగాను వివిధ మార్గాల ద్వారా 14,447 ఆర్జీలు నమోదు కాగా వీటిలో 293 ఆర్జీలు మాత్రమే గడువులోగా పరిష్కరించవలసినవి ఉన్నాయని వీటిని సంబంధిత శాఖల అధికారులు సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్‌ ఆదేశించారు. గడువుతీరిన ధరఖాస్తులు (బియాండ్‌ ఎస్‌ఎల్‌ఏ) ఏ శాఖలోను పెండిరగ్‌ ఉండదన్నారు. సమస్య పరిష్కారం అయినప్పటికి తిరిగి మరల ఆర్జీలు నమోదు కాకుండా ఆర్జీదారుడు సంతృప్తి చెందేలా శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. నిర్థేశించిన కాలం, గడువులోగా పరిష్కరించవలసిన ఆర్జీలను పెండిరగ్‌ లేకుండా పరిష్కరించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డిఆర్‌వో కె.మోహన్‌కుమార్‌ వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *