Breaking News

ఆరోగ్య మిత్ర, టీమ్‌ లీడర్‌ ఉద్యోగాల ఎంపికకు పరీక్ష…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 10వ తేదిన డా. వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ లో ఆరోగ్య మిత్ర, టీమ్‌ లీడర్‌ ఉద్యోగాల ఎంపికకు పరీక్ష నిర్వహించబడుతుందని ఆరోగ్యశ్రీ జిల్లా కో-ఆర్డినేటర్‌ డా. జె.సుమన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. డా. వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ఆరోగ్య మిత్ర, టీమ్‌ లీడర్‌ ఉద్యోగాలకై ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 10వ తేది ఆదివారం ఉదయం 9 గంటలకు విజయవాడ కానూరు వి.ఆర్‌ సిద్ధార్థ కళాశాలలోని ప్రాంగణంలో కంప్యూటర్‌ టైపింగ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుందని ఆరోగ్యశ్రీ జిల్లా కో`ఆర్డినేటర్‌ తెలిపారు. పరీక్ష కేంద్రానికి అభ్యర్థులు ఉదయం 9 గంటలకే చేరుకునేలా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్‌ నిబంధనలను తప్పని సరిగా పాటిస్తూ మాస్క్‌ ధరించి, శానిటైజ్‌ చేసుకోవాలని కోరారు. ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మాత్రమే పరీక్ష కేంద్రానికి హాజరు కావాలని ఆరోగ్యశ్రీ జిల్లా కో`ఆర్డినేటర్‌ సుమన్‌ ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *