Breaking News

స్లాబులు బీటలు వారి షాపుల లోపల కురుస్తున్న వర్షం…

-ఆందోళనలో వ్యాపారస్తులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కొత్తపేట హనుమంతరాయ చేపల మార్కెట్ ను ఈరోజు ఉదయం జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ స్థానిక వ్యాపారస్తులు తో కలసి మార్కెట్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యాపారస్తులు మహేష్ తో చిన్నపాటి వర్షానికే స్లాబ్లు లీక్ అయి, దారాలు దారాలు గా వర్షం షాపులోపాలనే పడుతుందని అందువలన సరుకు మొత్తం తడిచిపోయి ప్రతి బస్తా సరుకుకు ఐదు వేల నుంచి పది వేలు నష్టపోతున్నామని, నాలుగు సంవత్సరాలుగా ఈ మార్కెట్ కనీస మరమ్మతులకు నోచుకోని లేదని, ఎన్నిసార్లు అధికారులకు మరియు స్థానిక శాసన సభ్యునికి తెలియజేసిన వారి వద్ద నుండి స్పందన కరువైందని, టెర్రస్ బాగు చేస్తామని చెప్పి ఎండాకాలం కు ముందు పగలగొట్టి వదిలేశారని, అందువలన నీరు విపరీతంగా ఇంకిపోయి గోడలు బీటలు వారి నెత్తి పై పెచ్చులు పడుతున్నాయని, స్లాబ్స్ నుంచి పడుతూన్న నీళ్ల కోసం డబ్బాలు ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, మొదటి అంతస్తు లోనే కాదు గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా కింద షాపులులో గోడలు బీటలు వారి స్లాబ్ లో నుంచి నీరు లీకేజీ అవుతుందని ఒక్కొక్కసారి కరెంటు షాక్ కొడుతుందని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. షాపుల్లో పూర్తిస్థాయి సౌకర్యాలు లేనందువల్ల వ్యాపారం సరిగ్గా జరగక జీవనోపాధి కూడా దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ మున్సిపల్ కమిషనర్ గారు వ్యాపారస్తుల ఆవేదనను అర్థం చేసుకొని తక్షణమే హనుమంతరాయ చేపల మార్కెట్ ను సందర్శించి వారి సమస్యలను పరిష్కరించాలని మహేష్ కోరారు. ఈ కార్యక్రమంలో 53 డివిజన్ అధ్యక్షులు పొట్నూరి శ్రీను, జనసేన నాయకులు రేకపల్లి శ్రీను, శిగనం శెట్టి రాము స్టాలిన్, పోలిశెట్టి శివ, బావిశెట్టి శ్రీను, సాబిన్కర్ నరేష్, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *