గురువుల స్థానం ఎంతో ఉన్నతమైనది…

-గురుపౌర్ణమి వేడుకలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజంలో గురువుల స్థానం ఎంతో ఉన్నతమైనదని.. గురువులను స్మరించడం వల్ల త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గురుపౌర్ణమి పర్వదినం పురస్కరించుకుని బుధవారం నియోజకవర్గ వ్యాప్తంగా సాయిబాబా మందిరాల్లో వేడుకలు ఘనంగా జరిగాయి. పలు ఆలయాల్లో సాయిబాబా విగ్రహాలకు భక్తులు ప్రత్యేక అలంకరణలు చేసి పూజలు నిర్వహించారు. గవర్నర్ పేట, లెనిన్ సెంటర్, పైపులరోడ్డు, కండ్రిక, లక్ష్మీనగర్ సహా పలు సాయిబాబా ఆలయాల నందు జరిగిన పూజా కార్యక్రమాలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. గురుపౌర్ణమి రోజున గురువులను పూజించడం ఆనవాయితీగా వస్తుందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. భారతీయ సంస్కృతిలో గురువు స్థానం చాలా ప్రముఖమైనదని.. గురువును దైవంతో సమానంగా పూజించే గొప్ప సంస్కృతి మనదని వ్యాఖ్యానించారు. మానవజాతి కంతటికీ ఆధ్యాత్మిక వారసత్వాన్ని పంచి అజ్ఞానాంధకారాన్ని తొలగించిన వేదవ్యాసుని సమస్త జగత్తుకు గురువుగా భావిస్తుంటారని వెల్లడించారు. ఎంత ఎదిగినా, ఎందులో రాణించినా గురువులను పూజించడం మరవవద్దని తెలిపారు. మంచిని ప్రభోదించి, జ్ఞాన జ్యోతిని వెలిగించే గురువు స్థానం ఎంతో మహోన్నతమైనదని మల్లాది విష్ణు పేర్కొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమాలలో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పనకు ఐదు సంస్థలతో ఎంఓయూల మార్పిడి

కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : కుప్పం మునిసిపాలిటీలోని కొత్తపేటలో ఏర్పాటు చేసిన డెవలప్‌మెంటల్ ప్రాజెక్ట్స్ అండ్ ఇనిషియేటివ్స్ గ్యాలరీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *