
-మూడు రోజులు పాటు కొనసాగిన ఉచిత మెగా వైద్య శిబిరం
-క్యాంపులో వందల పదిమందికి ఉచిత వైద్య పరీక్షలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సౌజన్య ఆర్థోపెడిక్ సెంటర్ సౌజన్యంలో మూడు రోజులు గా మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సౌజన్య అర్ధోపెడిక్ సెంటర్ ప్రధమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సౌజన్య ఆర్థోపెడిక్ సెంటర్ వారి పర్యవేక్షనలో బుధవారం ఉదయం 08:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంట వరకు ఉచిత మెగా మెడికల్ క్యాంపులో భాగంగా మూడవరోజు నెఫ్రాలజీ క్యాంపు నిర్వహించారు. మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ ఆదేశాలు మేరకు ఈ క్యాంపుని విఎంసి ప్రధాన వైద్య అధికారి సీహెచ్ బాబూ శ్రీనివాసన్ బుధవారం పర్యవేక్షించారు. ఈ క్యాంపులో అత్యంత విలువ గల రక్తంలో కిడ్నీ ఇంఫెక్షన్ మరియు కిడ్నీ పని తీరుకి సంబంధించి స్కాన్, ప్రముఖ కిడ్నీ వ్యాధి నిపుణులైన డా. రవి శంకర్ ఎం.డీ,డీ.ఎం కన్సల్టేషన్ ఉచితముగా పరీక్షించడం జరిగింది. ఈ క్యాంపు లో సుమారుగా 250 మంది ఉచిత వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ నెల 11 నుండి నేటి వరకు వందలాది మంది పలు ఆరోగ్య సమస్యలు పై రక్తపరీక్షలు చేయించికొన్నారు. రోగుల అవసరాన్ని బట్టి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ క్యాంపు కు విచ్చేసిన ప్రతి ఒక్కరికి సంస్థ సంస్థ చైర్మన్ వీ.శ్రావన్ కుమార్ ధన్యవాదములు తెలిపారు. మూడు రోజులు సుమారు 650 మందికి సౌజన్య ఆర్థోపెడిక్ సెంటర్ నుంచి సర్వీస్ ను ప్రజలు అందుకున్నారు. ప్రముఖ కిడ్నీ స్పెషలిస్ట్ డాక్టర్.రవి శంకర్ ఎం.డీ,డీ.ఎం రోగులకు ఉచిత సేవలు అందించారు.
Prajavartha Online Telugu News