Breaking News

నగదు తీసుకొని ఓటు వేసే విధానం నశించాలి… : గాంధీ నాగరాజన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల్లో నగదు తీసుకొని ఓటు వేయడం, అదేవిధంగా ఓటు కోసం నగదు ఇవ్వడం వంటి విధానాలకు స్వస్తి చెప్పాలని, అటువంటి విధానాలను ఎవరు ప్రోత్సహించిన కఠినమైన చర్యలు తీసుకోవాలని, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలని, అలా జరిగినప్పుడే మన దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని ప్రముఖ గాంధేయవాది, గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు గాంధీ నాగరాజన్ అన్నారు. మహాత్మా గాంధీ మొదటి నిరాహార దీక్ష (1913-జులై 13)ని, రానున్న 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని భవానీపురం లోని నేతాజీ స్కూల్ నందు గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ & సెవెన్ ఎస్ టీవీ ఆధ్వర్యంలో మద్యపానం వల్ల కలిగే నష్టాలు అంశంపై ప్రశ్న- జవాబు పోటీలను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న గాంధీ నాగరాజన్ పాల్గొన్నమాట్లాడుతూ ప్రభుత్వాలు స్వచ్ఛందంగా మద్యపాన నిషేధాన్ని అమలు పరచాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా డబ్బు తీసుకొని ఓటు వేసే విధానాన్ని కూడా ఆయన నిరసించారు. గాంధీజీ ఆశయాల కోసం దేశ ప్రజలంతా సమిష్టిగా పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. గాంధీజీ ఆశయాల కోసం తాను నిరంతరం పనిచేస్తానని వివరించారు. స్త్రీకి పూర్తి స్వాతంత్రం వచ్చినప్పుడే దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చినట్లు అని తెలిపారు. అనంతరం మద్యపానం వల్ల కలిగే నష్టాల పై విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు నగదు, ప్రశంస పత్రాన్ని బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఎ.పి స్టేట్ మహిళ అధ్యక్షురాలు బి. భారతి, ట్రస్ట్ సభ్యులు, 7s నిర్వాహకులు, విద్యార్థిని, విద్యార్థులు, స్కూల్ యాజమాన్యం  తదితరులు పాల్గొన్నారు.
అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *