Breaking News

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారది లాంటిది సమాచార శాఖ..

-అభివృద్ధి సంక్షేమ పథకాలకు క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం..
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి పేదవర్గాల సంక్షేమానికి అమలు చేస్తున్న అమ్మఒడి, విద్యాకానుక, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, వైఎస్సార్‌ ఆసరా, జగనన్న తోడు పథకాలతో పాటు రాష్ట్రాభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో సమాచార శాఖ వారది లాంటిదని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.
సూర్యారావు పేట గోపాలరెడ్డి రోడ్డులోని స్టేట్‌ గెస్ట్‌హౌస్‌ ఆవరణంలోగల డార్మెటరి భవనం నందు జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారికి కేటాయించిన కార్యాలయాన్ని గురువారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ప్రారంభించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్‌టిఆర్‌ జిల్లా ఏర్పడి నేటికి 100 రోజులు పూర్తి అయిన సందర్భంగా సమాచార శాఖ కార్యాలయాన్ని ప్రారంభించడం సంతోషదయకంగా ఉందన్నారు. పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వినూత్నపథకాలను అమలు చేస్తున్నారన్నారు. సంక్షేమ పథకాలకు విస్తృత ప్రచారం కల్పించి ప్రజలకు చేరువ చేయడంలో సమాచార శాఖ అధికారులు వారధిలా పనిచేస్తున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర మంత్రులు, ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారుల పర్యటనలు సమావేశాలతోపాటు జిల్లా అభివృద్ధికి సంబంధించిన జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు సమీక్షా సమావేశాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియాకు అందించడంతో పాటు ఆయా కార్యక్రమాల్లో పాల్గొని పత్రికా ప్రకటనలు, వీడియోలు, ఫోటోలు మీడియాకు విడుదల చేయడంలో సమాచార శాఖ కీలకపాత్ర వహిస్తుందన్నారు. సమాచార శాఖకు గతంలో ఇంజనీరింగ్‌ విభాగం పబ్లిక్‌ రీలేషన్‌ విభాగాలు విడివిడిగా ఉండేవని పరిపాలన సౌలభ్యంలో భాగంగా జిల్లాల పున:వ్యవస్తీకరణలో రెండు విభాగాలను విలీనం చేయడం జరిగిందన్నారు. జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి మరియు సిబ్బందికి సరైన కార్యాలయం లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని తనదృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అతిధి గృహంలో ప్రస్తుతం ఉన్న కార్యాలయానికి తోడు ఆధునిక మౌలిక వసతులతో మరో మూడు గదులను కేటాయించిన్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఎన్‌టిఆర్‌ జిల్లా ఏర్పడి నేటికి 100 రోజులు పూర్తి అయిందని జిల్లాను అభివృద్ధి పదంలో నడిపేందుకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలో నాడు`నేడు పథకం ద్వారా ఆదనపు తరగతి గదుల నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు, హెల్త్‌ క్లినిక్‌ల భవన నిర్మాణాలు నిర్మించేందుకు మోగా గ్రౌండ్‌ మేళా ద్వారా నిర్మాణాలు చేపట్టి పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. సాలిడ్‌ వెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ కేంద్రాల నిర్వహణ ద్వారా పారిశుద్ద్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఉపాధిహామి పనులలో లక్ష్యాన్ని మించి కూలీలకు పనిదినాలు కల్పించి జిల్లా అగ్రస్థానంలో ఉందన్నారు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అర్హులైన వారిని గుర్తించి ప్రతి ఒక్కరికి అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, వైఎస్సార్‌ ఆసరా, జగనన్న తోడు పథకాలను అందజేస్తున్నామన్నారు. రైతుబరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందజేసి రైతులు పండిరచిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నామన్నారు. జగనన్న కాలనీలలో గృహా నిర్మాణాల పనులను వేగవంతం చేసి నిర్మాణాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జగనన్న శాశ్వత భూ హక్కు , భూ రక్ష పనులు నిర్థేశించిన గడువులోగా పూర్తి చేయనున్నట్లు జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు వివరించారు.
జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి వారి కార్యాలయ ప్రారంభ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.మోహన్‌కుమార్‌, సమాచార శాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ ఎల్‌ సర్ణలత, జాయింట్‌ డైరెక్టర్లు పి. కిరణ్‌కుమార్‌, టి. కస్తూరిబాయి, డిఐపిఆర్‌వో యు. సురేంద్రనాథ్‌, డిపిఆర్‌వో ఎస్‌వి మోహన్‌రావు, పబ్లిసిటీ అసిస్టెంట్‌ వివి ప్రసాద్‌, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ వి.వరప్రసాద్‌, ఆడియో విజువల్‌ సూపర్‌వైజర్‌ ఏ. సాయిబాబా సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *