Breaking News

పాఠశాలలో అదనపు గదుల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేస్తాం…

-విద్యార్థులకు పుస్తకాలు స్కూల్‌ బ్యాగులు యూనిఫామ్‌ పంపిణీ చేస్తున్నాం..
-జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మన బడి నాడు -నేడు పథకం ద్వారా జిల్లాలో పాఠశాలల అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరి బి. రాజశేఖర్‌కు వివరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా నాడు- నేడు రెండవ దశ పాఠశాలల అభివృద్ధి పనులపై గురువారం విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరి బి రాజశేఖర్‌ జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫ్‌రెన్స్‌ నిర్వహించారు.
నగరంలోని కలెక్టర్‌ కార్యాలయం వీడియోకాన్ఫరెన్స్‌ హాల్‌ నుండి ఎస్‌ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో 94 పాఠశాలలను విలీనం చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 465 పాఠశాలల అభివృద్ధి చేసి విద్యార్థిని విద్యార్థులకు అవసరమైన అదనపు గదుల నిర్మాణాలను చేపట్టాడం జరిగిందన్నారు. 85 అంగన్‌వాడీ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుని నిర్మాణ పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. పాఠశాల భవన నిర్మాణ పనులకు అవసరమైన ఇటుక, ఇసుక, సిమెంట్‌, ఐరన్‌, కంకర వంటి నిర్మాణ సామాగ్రిని సకాలంలో సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రతి వారం భవన నిర్మాణాల ప్రగతిని పంచాయతీరాజ్‌, విద్యా శాఖ, యంపిడివోలతో సమీక్షించి నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నామని కలెక్టర్‌ డిల్లీరావు ప్రిన్సిపల్‌ సెక్రటరికి వివరించారు.
జగనన్న విద్యా కానుక మూడవ విడతలో భాగంగా జిల్లాలోని 1,43,425 మంది విద్యార్థులకు అవసరమైన 7,91,362 నోట్‌పుస్తకాలు 1లక్ష 4 వేల 868 బెల్టలు సిద్దంగా ఉన్నాయని 1,30,786 బూట్లు సరఫరా చేయవలసి ఉండగా 60,636 సరఫరా చేయడం జరిగిందన్నారు. ఒకటి నుండి ఐదవ తరగతి విద్యార్థులకు ఫిక్టోరియల్‌ నిఘంటువులు 11,159, ఆరు నుండి పదోవ తరగతి విద్యార్థులకు 5,474 ఆక్స్‌ఫోర్డ్‌ నిఘంటువులు సరఫరా చేయడం జరిగిందన్నారు. 1,43,425 యూనిఫామ్‌లు సరఫరా చేయవలసి ఉండగా 24,333 సరఫరా చేయడం జరిగిందని 1,43,425 స్కూల్‌ బ్యాగులకు గాను 25,748 సరఫరా చేయడం జరిగిందన్నారు. 10,68,512 పాఠ్యపుస్తకాలకు సరఫరా చేయవలసి ఉండగా 6,96,426 సరఫరా చేయడం జరిగిందని సరఫరా చేసిన వాటిని విద్యార్థులకు పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు ప్రిన్సిపల్‌ సెక్రటరి బి.రాజశేఖర్‌కు వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *