విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో బల్క్‌మిల్క్ కూలింగ్ యూనిట్ (బియంసియు) లకు నిర్మాణాలకు అవసరమైన భూముల కేటాయింపు చేయడం జరిగిందని, ఆటోమెటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్ (ఎయంసియు) నిర్మాణాలకు అవసరమైన భూముల కేటాయింపును వేగవంతం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు మార్కెటింగ్ కమీషనర్ ప్రద్యుమ్నకు వివరించారు. మార్కెటింగ్ కమీషనర్ ప్రద్యుమ్నలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల జిల్లా అధికారులతో గురువారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలోని కలెక్టరేట్ నుండి కలెక్టర్ ఎస్ డిల్లీరావు జాయింట్ కలెక్టర్ ఎస్ నూపూన్ అజయ్ వీడియెకాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 272 గ్రామాలలో ఆటోమెటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్ (ఎయంసియు) కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన భూములను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేస్తున్నామన్నారు. ఇప్పటికే వందకు పైగా గ్రామాలలో భూములకు సంబంధించిన వివరాలను అందజేయడం జరిగిందని మిగిలిన 185 ఎయంసియులకు సంబంధించి భూకేటాయింపుల ప్రక్రియ వేగవంతం చేస్తున్నామని కలెక్టర్ డిల్లీరావు మార్కెటింగ్ కమీషనర్ ప్రద్యుమ్నకు వివరించారు.
Prajavartha Online Telugu News