విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్‌టిఆర్ జిల్లా లోని 13,979 మంది లబ్దిదారులకు వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా 13 కోట్ల 97 లక్ష 90 వేల రూపాయలు లబ్ది చేకూరనున్నదని జిల్లా జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు తెలిపారు.
జిల్లాలో వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా ప్రతీ వాహనదారుడికి సంవత్సరానికి 10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్న నేపథ్యంలో జిల్లాలో ఏడాది 2022`23 ఆర్థిక సంవత్సరంలో13,979 మంది లబ్దిదారులకు వాహన మిత్ర పథకం ద్వారా 13 కోట్ల 97 లక్ష 90 వేల రూపాయలను ఈనెల15వ తేది శుక్రవారం అందజేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
నియోజకవర్గాల వారిగా…
తిరువూరు నియోజకవర్గంలో 1,393 మంది లబ్దిదారులకు 1కోటి 39 లక్షల 30 వేల రూపాయలు
విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో 1,617 మంది లబ్దిదారులకు 1కోటి 61 లక్షల 70 వేల రూపాయలు
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 3,419 మంది లబ్దిదారులకు 3కోట్ల 41 లక్షల 90 వేల రూపాయలు
విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో 2,021 మంది లబ్దిదారులకు 2కోట్ల 2 లక్షల 10 వేల రూపాయలు
మైలవరం నియోజకవర్గంలో 1,673 మంది లబ్దిదారులకు 1కోటి 67 లక్షల 30 వేల రూపాయలు
నందిగామ నియోజకవర్గంలో 2,229 మంది లబ్దిదారులకు 2కోట్ల 22 లక్షల 90 వేల రూపాయలు
జగ్గయ్యపేట నియోజకవర్గంలో 1,627 మంది లబ్దిదారులకు 1కోట్ల 62 లక్షల 70 వేల రూపాయలు
మొత్తంగా జిల్లాలో 13,979 మంది లబ్దిదారులకు రూ. 13,97,90,000/` లబ్ది చేకూరనున్నదన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి విశాఖట్నంలో విడుదల చేయనున్న వాహన మిత్ర ఆర్థిక సహాయం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ఉటుందన్నారు. జిల్లాలో నిర్వహించే వైఎస్సార్ వాహన మిత్ర కార్యక్రమం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ జిల్లాకు చెందిన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, కార్పొరేషనర్ల చైర్మన్లు, అధికారులు పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు.
Prajavartha Online Telugu News