Breaking News

మేయర్ రాయన భాగ్యలక్ష్మి ని మర్యాదపూర్వకంగా కలిసిన అధికారులు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ నందు ఎగ్జిమినర్ అఫ్ అకౌంట్స్ గా S.N. చక్రవర్తి, అసిస్టెంట్ ఎగ్జిమినర్ అఫ్ అకౌంట్స్ గా టి.వాణి కుమారి భాద్యతలు స్వీకరించిన దర్మిలా శుక్రవారం నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ని వారి ఛాంబర్ నందు మర్యాదపూర్వకంగా కలిసారు. ఎగ్జిమినర్ అఫ్ అకౌంట్స్ గా ఎస్.ఎన్.చక్రవర్తి, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ నుండి మరియు అసిస్టెంట్ ఎగ్జిమినర్ అఫ్ అకౌంట్స్ గా  టి.వాణి కుమారి కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ నుండి విజయవాడకు బదిలీ అయినారు. కాగా ఇప్పటి వరకు ఎగ్జిమినర్ అఫ్ అకౌంట్స్ గా విధులు నిర్వహిస్తున్న E.అశోక్ మౌర్య మంగళగిరి ఎగ్జిమినర్ అఫ్ అకౌంట్స్ గాను, అసిస్టెంట్ ఎగ్జిమినర్ అఫ్ అకౌంట్స్ శ్రీమతి కె.నాగమణి, కాకినాడ కు బదిలీ అయినారు. మేయర్ వారిని కలసిన వారిలో అకౌంట్స్ ఆఫీసర్ కె. నరశింహ మూర్తి, మేనేజర్ బి.శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *