Breaking News

18వ డివిజన్ కృష్ణలంక రాణిగారి తోట నందలి పలు ప్రాంతాలలో పర్యటన…

-అధికారులకు పలు సూచనలు చేసినలు : కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, స్థానిక కార్పొరేటర్  వెంకట సత్యనారాయణతో కలసి డివిజన్ పరిధిలోని కృష్ణలంక, రాణి గారి తోట, సిమెంట్ గోడౌన్ మొదలగు ప్రాంతాలలో పర్యటించి స్థానికంగా ఉన్న పలు సమస్యలపై అధికారులను వివరాలు తెలుసుకొని పలు సూచనలు చేసారు. 18 వ డివిజన్ పరిధిలోని సిమెంట్ గోడౌన్ లోని 82 , 83 సచివాలయాల గ్రౌండ్ పల్లంగా ఉండుట గమనించి గ్రౌండ్ ఎత్తు పెంచుటకు తగిన చర్యలు తీసుకోవాలని మరియు అక్కడ గల 20 వ డివిజన్ నకు సంబందించి 100, 101 వార్డ్ సచివాలయాలను ఆ డివిజన్ పరిధిలోకి మార్చుటకు చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంలో తాడికొండ సుబ్బారావు ఎలిమెంటరీ స్కూల్ పడమర వైపు ఉన్న సిమెంట్ గోడౌన్ బిల్డింగ్ నుండి స్కూల్ నకు వెళ్ళుటకు దారిని ఏర్పాటు చేయాలని స్థానిక కార్పొరేటర్ కమిషనర్ దృష్టికి తీసుకువచ్చిన సందర్బంలో సదరు స్కూల్ ను పరిశీలించి ఉన్న సిమెంట్ గోడౌన్ ద్వారా స్కూల్ కి దారి ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

జాతీయ రహదారి నుండి వచ్చు వర్షపు నీరు పోవుటానికి సిమెంట్ గోడౌన్ ముందు నుండి రివర్ వైపు డ్రెయిన్ నిర్మాణమునకు అంచనాలు రూపొందించాలని మరియు కమ్యూనిటీ హల్లు సిద్దం కృష్ణారెడ్డి రోడ్ కంపొంట్ వాల్ నిర్మించుటకు మరియు కమ్యూనిటీ హాల్ నందు మిగిలిన పనులు అన్నియు పూర్తి చేయుటకు అవసరమగు అంచనాలు తయరు చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. అదే విధంగా సర్వీస్ రోడ్ లో వర్షపు నీటి నిల్వలు ఉండుట మరియు రాణి గారి తోట దగ్గర జాతీయ రహదారి నందు ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణము మొదలగు అంశముపై ఎన్ హెచ్ పి.డి తో సమవేశం ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. స్క్రూ బ్రిడ్జి నుండి వారధి వరకు హై వే సేర్విసే రోడ్ కి మద్యన అక్కడక్కడ రైలింగ్ లేని చోట్ల నేషనల్ హై వే వారి ద్వారా రైలింగ్ ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

స్క్రూ బ్రిడ్జి నుండి వారధి వరకు జాతీయ రహదారి నందలి సెంట్రల్ డివైడర్ నందలి గ్యాప్ ఫిల్లింగ్ లో మొక్కలు ఏర్పాటుకు చర్యలు చేపట్టి వారం రోజులలో పూర్తి చేయాలని ఉద్యానవన అధికారులను ఆదేశించారు. దీనితో పాటుగా బుద్ధ చక్ర దగ్గర పాత్ వే ఏర్పాటు ప్లానటరీ బాక్స్ ఏర్పాటు వంటి పనులు చేపట్టి పూర్తి స్థాయిలో పచ్చదనాన్ని పెంపొందించాలి అన్నారు.

పర్యటనలో ఎగ్జీక్యూటివ్ ఇంజనీర్లు చంద్ర శేఖర్, ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, ఏ.డి.హెచ్ శ్రీనివాసు, హెల్త్ ఆఫీసర్ డా.ఇక్బాల్ హుస్సేన్ మరియు ఇతర అధికారులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *