Breaking News

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పారదర్శకమైన సేవలు అందించండి…

-మౌలిక వసతుల లేమితో ఏ రోగి ఇబ్బంది పడకూడదు…
-జాయింట్‌ కలెక్టర్‌ నూపూర్‌ అజయ్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆసుపత్రులలో రోగులకు అవసరమైన మౌలిక వసతులను మందులను ప్రభుత్వం సరఫరా చేస్తుందని, పారదర్శకమైన సేవలు అందించడం ద్వారా రోగుల మన్ననలను పొందాలన్ని జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌ అజయ్‌ తెలిపారు.
నగరంలోని పాత ప్రభుత్వ ఆసుపత్రిని శుక్రవారం జాయింట్‌ కలెక్టర్‌ నూపూర్‌ అజయ్‌ ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులకు అందిస్తున్న వైద్యసేవలను మౌలిక వసతులను పరిశీలించారు. ఆసుప్రతిలోని అన్ని విభాగాలను పరిశీలించిన అనంతరం జాయింట్‌ కలెక్టర్‌ వైద్య అధికారులతో సిబ్బందితో మాట్లాడుతూ పేద మధ్య తరగతి ప్రజలు వైద్య సేవల కొరకు ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయిస్తారన్నారు. వివిధ అనారోగ్య కారణాలు ప్రసుతి వైద్య సేవల కోసం ఆసుపత్రిలో వచ్చినప్పుడు వారిని ఆప్యాయంగా చేరదీసి అవసరమైన వైద్య సహాయాన్ని అందించాలని డాక్టర్లకు సూచించారు. ఆసుపత్రి పరిశీలనలో అవుట్‌ పేషంట్ల రిజిస్టర్లను పరిశీలించి పిల్లల వార్డులు డెలివరీ వార్డులను తనిఖీ చేసి వైద్యలు సిబ్బంది అందిస్తున్న సేవలను రోగులనుండి అడిగి తెలుసుకున్నారు. రోగులకు సరఫరా చేస్తున్న పార్మసీని, లాబొరేటరీ ఆక్సిజన్‌ప్లాట్‌ పనితీరును పరిశీలించి వైద్యులతో ముఖాముఖి మాట్లాడారు. భోజనము, త్రాగునీరు సరఫరా ఇతర సదుపాయాలను నిరంతరం పరిశీలించాలన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగుల నుండి సిబ్బంది ఎటువంటి రుసుమును వసూలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని జాయింట్‌ కలెక్టర్‌ నూపూర్‌ అజయ్‌ కుమర్‌ తెలిపారు.
ఆసుపత్రి తనిఖీలో జాయింట్‌ కలెక్టర్‌ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా. సౌభాగ్యలక్ష్మి వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *