Breaking News

మహిళలపై సమాజంలో ఏర్పడిన ఆసమానతను తొలగిద్దాం…

-మహిళల రక్షణకు సేఫ్‌తో కలిసి ముందడుగు వేద్దాం…
-జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజంలో మహిళలపై ఏర్పడిన ఆసమానతను తొలగించడం ద్వారా వారికి మానసిక స్థైర్యం కలిగించగలుగుతామని మహిళల కోసం రూపొందించిన చట్టాలపై అవగాహన కలిపించి వారిని రక్షించేందుకు సేఫ్‌ (స్టెప్‌ ఏహీర్డ్‌ ఫర్‌ ఇక్వాలటీ) సంస్థ చేపట్టిన చర్యలలో ప్రతి ఒక్కరూ అడుగు కలపాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.
మహిళల రక్షణకు చేపట్టిన చర్యలలో భాగంగా శుక్రవారం సేఫ్‌ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు సిద్ధార్థ ఆర్ట్స్‌ కళాశాలలోనిర్వహించిన అవగాహన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ పురాతన కాలం నుండి మహిళలు పురుషులకంటే తక్కువ అన్న నూన్యత భావం కొనసాగుతుందన్నారు. ఆధునిక సమాజంలో కూడా ఈ పరిస్థితి ఉండడం సరి కాదన్నారు. మహిళలు పురుషులు సమానత్వమనే భావాన్ని కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలకు రాజ్యంగం అనేక హక్కులను కల్పించిందని మహిళలు వాటిని సద్వినియోగం చేసుకునేలా కృషి చేయవలసిన భాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందన్నారు.ఈ విషయంలో సేఫ్‌ సంస్థ టీమ్‌ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పలు కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. మహిళల రక్షణ కొరకు ముందుకు వచ్చేవారితో అడుగులో అడుగు కలిసేలా జిల్లా యంత్రాంగ తరుపున పూర్తి సహకారం అందిస్తామన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్నత విద్యాను అభ్యసించి జీవితంలో స్థిరపడేలా తల్లిదండ్రులకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. తల్లిదండ్రులు సహకరించిన్నప్పుడు ఆడపిల్లలో ధైర్యం తానంతట అదే వస్తుందన్నారు. పాఠశాలలు కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించేలా ప్రత్యేక తరగతులను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. అసమానత కలిగించే విధంగా మాట్లాడినా మానసిక వేధింపులు లైగింక దాడులకు పాల్పడితే కఠినమైన శిక్షణను ఎదుర్కోవలసి వస్తుందనే విషయాన్ని తెలియజేసి మానసిక ప్రవర్తన మార్చుకునేలా కృషి చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ ప్రైవేట్‌ కళాశాలలో మానసిక వైద్యులను నియమించి విద్యార్థులకు కౌన్సిలింగ్‌ నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు.
శాసనమండలి సభ్యులు కె ఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ పురుషులకు మహిళలకు ఇరువురికి రాజ్యంగం సమాన హక్కులను కల్పించిందన్నారు. నానాటికి మహిళల అక్షరాశ్యతా శాతం పెరుగుతుందని తల్లిదండ్రులు ఆడపిల్లలలో ధైర్యన్ని నింపాలన్నారు. లైగింక దాడులు మానసిక వేధింపులను నివారించడం ద్వారా సురక్షితమైన జిల్లాగా తీర్చిదిందేందుకు ప్రజాప్రతినిధులు అధికారులు స్వచ్చంద సంస్థలు కళాశాల పాఠశాలల యజమాన్యలు కృషి చేయాలని కోరారు.
సేఫ్‌ సంస్థ అధ్యక్షురాలు జి. జోత్స్న మాట్లాడుతూ సమాజంలో మహిళల రక్షణకై అనేక కార్యక్రమాలను నిర్వహింస్తున్నామన్నారు. పాఠశాలలు, కళాశాలలు, నిరుపేదల నివాసిత ప్రాంతాలలో అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నామన్నారు. మహిళా చట్టాలు హక్కుల గురించి వివరించి, ధైర్యంగా సమాజంలో దైనందిన కార్యక్రమాలు జీవించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కళాశాలలో సేఫ్‌ టీమ్‌లను ఏర్పాటు చేసి విద్యార్థిని విద్యార్థుల ప్రవర్తనపై నిఘా ఉంచి అసభ్య ప్రవర్తన చేస్తున్న వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చేలా చర్యలు తీసుకున్నామన్నారు. తొలుత మహిళలపై జరుగుతున్న లైగింక వేధింపులు తల్లిదండ్రుల నిర్లప్తత పై విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన సందేశాత్మక లఘు నాటికలు ఆహుతులను అలరించాయి.
తొలుత విద్యార్థిని విద్యార్థులతో నలంద డిగ్రీ కళాశాల నుండి సిద్ధార్ధ ఆర్డ్స్‌ కళాశాల వరకు నిర్వహించిన ర్యాలీని డిసిపి విషాల్‌ గున్నీ ప్రారంభించారు.
అవగాహన సదస్సులో బార్‌కౌన్సిల్‌ సభ్యులు సుంకర రాజేంద్రప్రసాద్‌,సేఫ్‌ (స్టెప్‌ ఏహీర్డ్‌ ఫర్‌ ఇక్వాలటీ) సంస్థ కార్యదర్శి జి. వాణి సభ్యులు డా.ఎ. నీరజ, సిహెచ్‌ రాధా కుమారి, వై అంజనీ, విజయలక్ష్మి, మంజులూరి కృష్ణకుమారి, ఉషారాణి, చాముండేశ్వరి, నగరానికి చెందిన 34 కళాశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *