Breaking News

18 సంవత్సరాలు నిండిన వారికి మూడవ విడత కోవిడ్‌ వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోసు…

-జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి మూడవ విడత కోవిడ్‌ వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోసును ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు తెలిపారు. కోవిడ్‌ వ్యాక్సిన్‌ మూడవ విడత బూస్టర్‌ డోసు పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు గిరిపురంలోని హెల్త్‌ సెంటర్‌ నందు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి బూస్టర్‌ డోసును అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. కోవాక్సిన్‌, కోవిషీల్డ్‌ ఇంజక్షన్‌లను జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు సరఫరా చేయడం జరిగిందన్నారు. గతంలో మొదటి విడత, రెండు విడత ఏ వ్యాక్సిన్‌ తీసుకున్నారో వారికి అదే వ్యాక్సిన్‌ను ఆసుపత్రుల ద్వారా అందిస్తున్నారన్నారు. ఏఎన్‌యంలు, ఆశాకార్యకర్తలు ఇప్పటివరకు రెండు డోసులు పూర్తి చేసిన వారిని గుర్తించి మూడవ డోసును అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటివరకు కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోని వారు తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేయించుకుని కోవిడ్‌ బారిన పడకుండా ప్రాణాలను రక్షించుకోవాలన్నారు. కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవడం వలన ఆరోగ్యంలో ఎటువంటి సమస్యలు ఎదురుకావన్న విషయాన్ని వివరించి వ్యాక్సిన్‌ అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యాక్సిన్‌ వేసిన వారి వివరాలను పోర్టల్‌ నందు నమోదు చేసి వ్యాక్సిన్‌ అందించిన వెంటనే సర్టిఫికేట్లను అందించాలన్నారు. కోవిడ్‌ వైరస్‌ నాల్గవదశలో చాపకింద నీరులా విస్తరిస్తున్న తరుణంలో ప్రజలు కోవిడ్‌ నిబంధనలను పాటించాలన్నారు. ప్రజలు షాపింగ్‌ మాల్స్‌, రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌, సినిమా థియేటర్స్‌, ఎగ్జిబిషన్‌లు పార్థనా మందిరాలు వంటి రద్దీ ప్రాంతాలకు వెళ్లినప్పుడు మాస్క్‌ను తప్పని సరిగా ధరించడం, శానిటైజ్‌ చేసుకోవలన్నారు. గతంలో 24 గంటలు అర్టిపిసిఆర్‌ వైరస్‌ నిర్థారణ పరీక్షలు నిర్వహించడం జరిగేదని ప్రస్తుతం 8 గంటలు మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారని అవసరమైతే వైరస్‌ నిర్థారణ పరీక్షల సమయం పెంచేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు.
కార్యక్రమంలో డియంహెచ్‌వో డా.యం. సుహసిని, గిరిపురం హెల్త్‌ సెంటర్‌ వైద్యురాలు డా. రవళి, వైద్యాఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *