-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుండి స్వీకరించిన ఆర్జీలకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన గడపగపడకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్వీకరించిన ఆర్జీలపై శనివారం నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు జాయింట్ కలెక్టర్ ఎస్ నూపూర్ అయజ్ డిఆర్వో కె.మోహన్‌కుమార్, నగరపాలక సంస్థ అధికారులతో నగరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు సమావేశం నిర్వహించారు.
పశ్చిమ నియోజకవర్గంలో ఇటీవల నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానిక ప్రజలు ఆర్జీలను సమర్పించడం జరిగిందని వాటిని సాద్యమైనత త్వరలో పరిష్కరించాలని రేషన్ కార్డులలో కుటుంబ సభ్యుల పేర్లను చేర్పు మార్పులకు సంబంధించిన ఆర్జీలు ఎక్కువగా ఉన్నాయని జగనన్న విద్యా కానుక జగనన్న వసతి దీవెన వంటి పథకాలకు అర్హులను గుర్తించడంలో విద్యార్థులకు సమస్యలు ఎదురవుతున్న దృష్ట్యా రేషన్‌కార్డులలో మార్పులు చేర్పులను త్వరితగతిన పూర్తి చేయాలని పేదలందరికి ఇళ్లు పథకం ద్వారా 90 రోజులలో ఇళ్లపట్టాల మంజూరు వంటి ఆర్జీలు పెట్టుకున్నారని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, స్థానిక శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
దీనిపై కలెక్టర్ స్పందిస్తూ రేషన్‌కార్డులలో పేర్ల మార్పుచేర్పులు తొలగింపులు ప్రక్రియ నిరంతరం జరుగుతుందన్నారు. క్షేత్రస్థాయిలో రేషన్ కార్డుల సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుక చర్యలు తీసుకోవాలని సచివాలయ ఉద్యోగులను ఆదేశించామన్నారు. 463 జి.వో రేగ్యులైజ్ చేయడం జరిగిందని ఇందుకు సంబంధించిన ఎసెస్మెమెంట్ ప్రక్రియ పూర్తి చేయడం ద్వారా సుమారు 6 వేల మందికి పైగా లబ్ది చేకూరుతుందని త్వరలో ఇందుకు సంబంధింంచి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. 225 జి.వో కింద ప్రజలు సమర్పించి ధరఖాస్తులను ప్రభుత్వానికి ప్రతిపాధించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పేదలందరికి ఇళ్లు పథకంలో భాగంగా రెండవ దశ జగనన్న కాలనీలో మరో నాలుగు లేఅవుట్లకు సంబంధించిన భూమిని గుర్తించాలని ఇప్పటికే ఆదేశాలు జారి చేయడం జరిగిందన్నారు. జగనన్న కాలనీలో గృహలను మంజూరు చేసేందుకు అర్హులైన లబ్దిదారుల జాబితాను రూపొందించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించమన్నారు. గడపగడపకు మన ప్రభుత్వంలో ఇళ్ల మంజూరు కొరకు సమర్పించిన ఆర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన వారికి ఇళ్లు కేటాయించేందుక చర్యలు తీసుకోవాలని సచివాలయ సిబ్బందికి ఆదేశించడం జరిగిందని కలెక్టర్ అన్నారు.
Prajavartha Online Telugu News