Breaking News

రాష్ట్ర కమిషన్ ఆత్మీయ మరియు పరిచయ సమావేశం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రo లోని వివిధ ప్రాంతాల షెడ్యుల్ తెగల నాయకులతో రాష్ట్ర కమిషన్ ఆత్మీయ మరియు పరిచయ సమావేశమును విజయవాడ లోని మెట్రోపాలిటన్ హోటల్ నందు శనివారం నిర్వహించటం జరిగింది. ముందుగా హాజరయిన వారందరూ షెడ్యుల్ తెగల అభ్యున్నతి కోసం ప్రత్యెక కమిషన్ ను ఏర్పాటు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు తెలియచేసారు. వివిధ ప్రాంతాలలో వివిధ సమస్యలపై పోరాడుతున్న నాయకులను ఒకే వేదికపై తీసుకు వచ్చి రాష్ట్రంలోని గిరిజన మరియు ఆదివాసీ సమస్యలపై సమగ్రమైన అవగాహనన కలిపించటమే దీని ప్రధాన ఉద్దేశ్యమని ముఖ్య అతిధి గా విచ్చేసిన డా.కుంభా రవిబాబు తెలిపారు.
ఈ రోజు వివిద జిల్లాల నుండి హాజరయిన ప్రతినిధులు రాష్ట్రంలోని 32 లక్షల ప్రజలకోసం 42 వేల ఉద్యోగుల కోసం పోరాడుతున్న ప్రతినిధులు అని కొనియాడారు. చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత రాష్ట్రంలో ని అన్ని ITDA ల లోని సమస్యలపై స్పందించి ఆయా ప్రాజెక్ట్ అధికారులకి మరియు గిరిజన సంక్షేమ శాఖ కు పరిష్కారాల కోసం సూచనలు చేయటం జరిగింది అంటూ , 35 షెడ్యుల్ తెగల లో ఒకటైన చెంచులు అత్యంత వెనుకబడిన వారు అని, వారు నివసించే పెద్దచెరువు అనే చెంచు గూడెంను కమిషన్ సందర్శించటం జరిగింది అని తెలుపుతూ, కమిషన్ సందర్శన తరువాత ఆ గూడెం కు ఆధార కార్డ్స్ , ఇళ్ళ పట్టాలు, బడి, రోడ్లు, త్రాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించటం కమిషన్ విజయం అని పేర్కొన్నారు. ఆదివాసీల అభ్యున్నతి జరగాలి అంటే విద్య, వైద్య, ఆర్దిక మరియు ఉద్యోగావకాశాల లో అభివృద్ధి చెందాలని చెబుతూ, నేటికీ గిరిజనులలో కేవలం 46 శాతం అక్షరాస్యత ఉండటం బాధాకరమని, అక్షారస్యత పెరగటమే అభివృద్ధికి సోపానం అని అన్నారు. హాజరయిన నాయకులు అనేక సంఘాలలో పనిచేస్తున్నా అందరి అంతిమ లక్ష్యం ఆదివాసీల సంక్షేమం కావాలని కోరారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించటం తమ విధానం కాదు అని, ప్రభుత్వం కల్పించే పలు రకాల సంక్షేమ పధకాలు చిట్ట చివరి మనిషి వరకు చేరేలా చేయటంలోనూ, రాజ్యంగపరంగా కల్పించిన సదుపాయాలు పొందటంలో ఎదురయ్యే అవరోధాలు నియంత్రణకు కృషి చేయాలని కోరారు. ఈ రోజు ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల కోసం ప్రత్యేక విశ్వ విద్యాలయం, మెడికల్ కాలేజీ, గురుకులాలు, ఏర్పాటు చేయటం జరుగుతోందని వీటిని సమర్ధవంతంగా వినియోగించుకొని అభివృద్ధి చెంది , ఆర్ధిక ఫలాలను అనుభవించాలని ఆకాంక్షించారు. ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత మూడేళ్ళలో 4,50,000ల ఎకరాల పైగా భూపంపిణీ చేపట్టటం ఆదివాసీల అదృష్టమని, ఇంకా భూపంపిణీ కొన్ని లక్షల ఎకరాలు పంపిణీ చేయవలసింది ఉంది అన్నారు. ఈ దిశగా కమిషన్ కూడా తగు సూచనలు చేయటం జరుగుతుందని తెలిపారు. దక్షిణ భారతం లో ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాలను అరికట్టాలంటే , దేశం లో ఉన్న44 షెడ్యుల్ తెగల పార్లమెంట్ సభ్యులు కలిసి కట్టుగా ఆదివాసీల సంక్షేమం కోసం కొత్త చట్టాల రూపకల్పన చేయటం అసాధ్యమేమీ కాదని అన్నారు. దీనికి తొలి అడుగుగా రాష్ట్రం లో ఉన్న అన్ని ఆదివాసీల సంఘాలు ఏకతాటి పైకి రావాలని కోరారు. ఆదివాసీల సంక్షేమం కోసం ఏర్పడిన ఈ కమిషన్ మీ అందరిదీ అన్నారు. ముఖ్యమంత్రి శ్రీ వై యస్ జగన్మోహన రెడ్డి గారు, కమిషన్ చైర్మన్ గా నియమిస్తూ కమిషన్ కు విస్తృతమైన అధికారాలు ఇచ్చారు అని, క్యాబినెట్ అధికారాలతో పాటు న్యాయపరమైన అధికారాలు, విస్తృతమైన స్వేచ్చ, స్వాత్రంత్ర్యం ఇచ్చినందుకు కమిషన్ తరపున ధన్యవాదాలు తెలిపారు. రాజ్యాంగపరమైన, న్యాయపరమైన హక్కులకు విఘాతం కలిగినప్పుడు, చట్టాలని పరిరక్షించటం లో కమిషన్ ఎప్పుడూ ముందు ఉంటుందని అన్నారు. ఆదివాసీలకు అన్యాయం జరిగితే కమిషన్ కు ఉన్న చట్టపరమైన అధికారాలు వినియోగించటం లో సంసయించదు అని అవసరమైతె కమిషన్ ముందు హాజరు అయ్యే విధంగా సమన్స్ కూడా జారీ చేస్తామని అన్నారు. ప్రత్యేకించి ST నకిలీ కుల ధృవీకరణ పత్రాలు జారీ చేసే తహసిల్దార్ లపై కమిషన్ కు ఉన్న అధికారాలతో పాటు చట్టపరం గా తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని మరియు హాజరయిన నాయకులను కమిషన్ మరింత మెరుగుగా పనిచేయటం కోసం సూచనలు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశం లోకమిషన్ సభ్యులు శ్రీ సోమశంకర్ నాయక్, శ్రీమతి కె రాము, యం విశ్వేశ్వర రాజు లు ప్రసంగిస్తూ కమిషన్ కు చైర్మన్ గా శ్రీ కుంభా రవిబాబు గారిని నియమించటం ఆదివాసీల అదృష్టమని, కమిషన్ గౌరవం ఇనుమడించే విధంగా అన్నివిధాల సహకరిస్తామని అన్నారు.
ఈ సమావేశం లో ప్రొఫెసర్ ఎ సుబ్రహ్మణ్యం, ఆదివాసీలకు రాజ్యాంగపరంగా ప్రభుత్వం చేసిన చట్టాలపై అవగాహన్ కల్పించారు. ఆంద్ర యునివర్సిటీ తెలుగు డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ అయిన జె అప్పారావు చేసిన ఉత్తేజ, ఉద్వేగభరిత ఉపన్యాసం సభ్యులను ఆకట్టుకొంది. ఈ సమావేశం లో పాల్గోనిన వివిధ సంఘాల నాయకులు, కుడుముల రామచంద్రయ్యగారు, అనుమోలు వంశీకృష్ణ, పి వి రమణ , సత్యనారాయణ , ఆత్మకూరు మహిళా చెంచు నాయకురాలు హుస్సేనమ్మ , ఎన్ మోహన్ కుమార్ ధర్మ మరియు ఇతరులు మాట్లాడుతూ తమ ప్రాంతాలలోని సమస్యలను కమిషన్ చైర్మన్ డాక్టర్ కుంభా రవిబాబు దృష్టికి తెచ్చారు .తన దృష్టికి తెచ్చిన అన్ని సమస్యల పరిష్కారం కోసం కమిషన్ పరిధిలో ఖచ్చితమైన ప్రయత్నం చేస్తామని హాజరయిన నాయకులకు చైర్మన్ డాక్టర్ కుంభా రవిబాబు హామీ ఇచ్చారు. గిరిజనులకు విద్య, ఉద్యోగ అవకాశాల పట్ల ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో ఉన్నారని కొనియాడారు. చివిరిగా కార్యక్రమం ను విజయవతం చేసిన ప్రతి ఒక్కరికి యస్.సతీష్, ఉప సంచాలకులు,APST కమిషన్ వారు ధన్యవాదాలు తెలియచేసియున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *