విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బల్క్‌మిల్క్ కూలింగ్ యూనిట్(బియంసియు), ఆటోమెటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్(ఎయంసియు) నిర్మాణాలను త్వరితగతిన చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. జగనన్న పాలవెల్లువ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో చేపడుతున్న నిర్మాణాల పై జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, శనివారం జాయింట్ కలెక్టర్ ఎస్ నూపూర్ అజయ్ కుమార్, తహీశీల్థార్లు, పశువర్థక శాఖ అధికారులు, అమూల్ నోడల్ ఆఫీసర్‌తో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో 17 మండలాలలో నిర్మాణం చేపట్టనున్న 272 ఆటోమెటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్(ఎయంసియు)లకు ఇప్పటికే 112 స్థలాలను గుర్తించడం జరిగిందన్నారు. మిగిలిన 160 నిర్మాణాలకు అవసరమైన భూములను గుర్తించే ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.112 బల్క్‌మిల్క్ కూలింగ్ యూనిట్(బియంసియు)నిర్మాణాలల భాగంగా ఒక్కొక్క బియంసియుకు 5 సెంట్ల భూమి, ఒక్కొక్క ఎయంసియు 3 సెంట్లకు పైగా స్థలం కేటాయించడం జరిగిందన్నారు. బల్క్‌మిల్క్ కూలింగ్ యూనిట్, మరియు ఆటోమెటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్ నిర్మాణాలకు జరుగుతున్న పనులను వేగవంతం చేయాలన్నారు. ఈ నిర్మాణాలు పూర్తి అయితే రైతులకు అందుబాటులోకి వస్తాయి. ఒక్కొక్క బియంసియు 21 లక్షల వ్యయంతో ఒక్కొక్క ఏయంసియు 15 లక్షల వ్యయంతో నిర్మాణాలను చేపడతున్నామన్నారు. తద్వారా సొంత భవనాలు సమకూరుతాయన్నారు.
Prajavartha Online Telugu News