విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా 44వ చెస్ ఒలంపియాడ్ టార్చ్ అదివారం నగరానికి చేరుకుంటుందని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు తెలిపారు. అజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను పురస్కరించుకుని ఇంటర్నేషనల్ ఫిడరేషన్ ఆఫ్ చెస్ ఆధ్వర్వంలో నిర్వహించే 44వ చెస్ ఒలంపియాడ్ సందర్భంగా దేశంలోని 35 రాష్ట్రాలు కేంద్రాపాలిత ప్రాంతాలలోని 40 జిల్లాలలో ఒలంపియాడ్ టార్చ్‌ని ప్రదర్శించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ఎన్‌టిఆర్ జిల్లాలోని విజయవాడ నగరానికి చెస్ ఒలంపియాడ్ టార్చ్ చేరుకుంటుందన్నారు. టార్చ్ రిలే బృందం హైదరాబాద్ నుండి బయలుదేరి ఆదివారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటుందన్నారు. గన్నవరం విమానాశ్రయం వద్ద యువజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి టార్చ్‌ని అందుకుని చెస్ క్రీడలో గ్రాండ్ మాస్టర్‌కు అందిస్తారన్నారు. విమానాశ్రయం నుండి అలంకరించిన ప్రత్యేక వాహనంలో ర్యాలీగా బయలుదేరి రామవర్పాడు, బెంజ్‌సర్కిల్, బందర్‌రోడ్డు, ప్రకాశం బ్యారేజ్, కనదుర్గమ్మ దేవస్థానం నుండి తిరిగి తుమ్మలపల్లి కళాక్షేత్రంకు చేరుకుంటుందన్నారు. కళాక్షేత్రం వద్ద చెస్ ఒలంపియాడ్ టార్చ్‌ను రాష్ట్ర గృహా నిర్మాణ శాఖ మాత్యులు జోగిరమేష్ అందుకుని కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన టార్చ్ స్టాండ్ నందు అమర్చుతారన్నారు. కళాక్షేత్రంలో ఆడియో, వీడియో దృశ్య మాద్యమం ద్వారా గౌరవ ప్రధాన మంత్రి సందేశాన్ని ప్రదర్శించడం జరుగుతుందన్నారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. చెస్ క్రీడలో గ్రాండ్ మాస్టర్ అర్జున్ అవార్డ్ గ్రహిత కోనేరు హంపి, గ్రాండ్ మాస్టర్ ముసునూరి రోహిత్ లలిత్‌బాబు, తదితర క్రీడకారులను ఆంధ్ర చెస్ అసోసియేషన్ సన్మానించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అతిధుల సందేశాల అనంతరం చెస్ ఒలంపియాడ్ టార్చ్‌ని గ్రాండ్ మాస్టర్ కు అందజేసి ఘనంగా వీడ్కోలు పలకడం జరుగుతుందన్నారు. ఒలంపియాడ్ టార్చ్ ర్యాలీలో ప్రజా ప్రతినిధులు అధికారులు క్రీడాకారులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొననున్నారని కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.
Tags vijayawada
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News