Breaking News

లింగ నిర్థారణ పరీక్షలు చేసిన ప్రోత్సహించిన క్రిమినల్‌ చర్యలు

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గర్భస్థ పిండ లింగ నిర్థారణ పరీక్షలు నిర్వహించిన ప్రోత్సహించిన వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు హెచ్చరించారు.
లింగ నిర్థారణ పరీక్షల నిషేదిత చట్టం అమలు పై జిల్లా స్థాయి మల్టీమెంబర్‌ అప్రోప్రియేట్‌ అథారిటీ అడ్వజరీ కమిటి సమావేశం శనివారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ గర్భస్థ పిండ లింగ నిర్థారణ పరీక్షలు నిర్వహించడం ప్రోత్సహించడం నేరమని ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టరీత్య క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలన్నారు. సమాజంలో స్త్రీ, పురుషులు సమానమేనని వాస్తవంగా పురుషుడు కంటే మహిళ ఏ విషయంలోను తక్కువ కాదన్నారు. నేడు అన్ని రంగాలలో మహిళలు పురుషులతో సమానంగా ముందుకు సాగుతున్నారన్నారు. లింగ నిర్థారణ పరీక్షల ద్వారా పుట్టబోయేది ఆడశిశువు అని తెలియగానే కొంత మంది ఆజ్ఞానంతో గర్భస్రావానికి పాల్పడుతున్నారన్నారు. ఇది అత్యంత బాదకరమని ఒక విధంగా హత్య చేసినట్లేనన్నారు. ఇటువంటి సంఘటనలు రూపుమాపడానికి ప్రభుత్వం లింగనిర్థారణ నిషేదచట్టం 1994న తీసుకువచ్చి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో 288 రిజిస్ట్రరైన స్కానింగ్‌ సెంటర్లు
ఉన్నయన్నారు. వీటిలో 6 ప్రభుత్వ నిర్వహణలో ఉన్నాయన్నారు. స్కానింగ్‌ సెంటర్ల నిర్వహకులు లింగనిర్థారణ పరీక్షలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. లింగనిర్థారణ నిషేదచట్టం పై బ్యానర్లు, కరపత్రాలు ముంద్రించి స్కానింగ్‌ సెంటర్లు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు ప్రభుత్వ ఆసుపత్రిలలో ప్రజలను చైతన్యవంతులుగా చేయాలన్నారు. మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి తగ్గిపోతున్న మహిళల శాతాన్ని వివరించాలన్నారు. స్వచ్చంద సంస్థల ద్వారా లింగనిర్థారణ నిషేదచట్టం ప్రాముఖ్యతను ప్రజలకు వివరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎఎన్‌యంలు ఆశావర్కర్లు సూపర్‌వైజర్లతో జిల్లా స్థాయి సదస్సును నిర్వహించి లింగనిర్థారణ నిషేదచట్టం గురించి వివరించాలన్నారు. జిల్లాలో నమోదు అయిన స్కానింగ్‌ సెంటర్లను ఎప్పటికప్పుడు అదికారులు తనిఖీలు నిర్వహించి రిజిస్ట్రర్లను పరిశీలించాలన్నారు. చట్టవిరుద్దంగా లింగనిర్థారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదు వస్తే విచారణ జరిపి ఆయా స్కానింగ్‌ సెంటర్లను సీజ్‌ చేయడంతో పాటు 25 వేల రూపాయల జరిమాన జైలు శిక్ష విధించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు. లింగనిర్థారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందించిన వారికి లక్ష రూపాయల పోత్సహక బహుమానం అందించడం జరుగుతుందన్న విషయాలపై ప్రచారం నిర్వహించి ప్రజలను చైతన్యవంతులుగా చేయాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు.
జిల్లా స్థాయి మల్టీమెంబర్‌ అప్రోప్రియేట్‌ అథారిటీ అడ్వజరీ కమిటి సభ్యులు మెట్రోపాలిటిన్‌ సెసెన్స్‌ జడ్జి జస్టిస్‌ బి. శ్యామ్‌ సుందర్‌, మాట్లాడుతూ ప్రస్తుతం నిర్వహిస్తున్న స్కానింగ్‌ సెంటర్ల రెన్యూవల్‌ కొరకు నూతన స్కానింగ్‌ సెంటర్ల ఏర్పాటుకు ధరఖాస్తు చేసుకున్న వారి ధరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి మిషనరి పరిస్థితిని పరిశీలించి రెన్యూవల్‌ చేయాలన్నారు. నూతన స్కానింగ్‌ సెంటర్లలో కొత్త మిషనరి ఏర్పాటు చేసినట్లేయితే నిబంధనల మేరకు రిజిస్ట్రేషన్‌ చేయాలన్నారు.
సమావేశంలో డిసిపి మేరీప్రశాంతి, డియంహెచ్‌వో డా. యం సుహసిని, వాసవ్య మహిళ మండలి ప్రతినిధి విజయ, స్వచ్చంద సంస్థ నిర్వహకులు జోషిబాబు, గైనకాలజిస్టులు డా. కేశవచంద్ర, డా.శ్రీనివాసరావులు తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *